Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డను చంపేస్తామంటూ బెదిరించి రైలులో మహిళపై అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2023 (09:31 IST)
ప్రయాణికులు లేని ఓ రైలు బోగీలో కన్నబిడ్డను చంపేస్తామంటూ బెదిరించిన ఇద్దరు కామాంధులు.. ఓ మహిళా ప్రయాణికురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. రైలు బోగీ ఖాళీగా ఉండటంతో ఈ దురాగతానికి పాల్పడ్డారు. రైలు గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు.. ఆ రోజే నిందితులను అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన శనివారం అస్సాం నుంచి వెస్ట్ బెంగాల్ వెళుతున్న సిఫాంగ్ రైలులో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సిఫాంగ్ ఎక్స్‌ప్రెస్ అస్సాం రాజధాని గౌహతి నుంచి బెంగాల్‌లోని అలీపూర్ ద్వార్‌కు వెళుతుండగా, ఓ మహిళ తన బిడ్డతో కలిసి శనివారం గౌహతి రైల్వే స్టేషన్‌లో ఎక్కింది. ఈ రైలు ఫకీరాగ్రామ్ చేరుకునేసరికి బోగీలోని ప్రయాణికులు దాదాపుగా ఖాళీ అయిపోయారు. 
 
ఈ క్రమంలో అదే బోగీలో ప్రయాణిస్తున్న అస్సాం వాసులు అబు (25), మొయినుల్ హక్ (26)లు బాధిత మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. మహిళ బిడ్డను రైల్లో నుంచి తోసేస్తామంటూ ఆమెను బెదిరించి, కట్టేసి కొట్టారు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ రైలు అలీపూర్‌ద్వార్ జంక్షన్‌కు చేరుకున్నాక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, తక్షణం స్పందించిన పోలీసులు శనివారం రాత్రే ఇద్దరు కామాంధులను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments