Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ మహిళతో హనీట్రాప్.. న్యూడ్ కాల్.. ఆపై సన్నిహితంగా... : సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అరెస్టు

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2023 (09:18 IST)
సీఐఎస్ఎఫ్‌లో పని చేసే ఓ కానిస్టేబుల్ చిక్కుల్లో పడ్డారు. పాకిస్తాన్ మహిళతో హనీట్రాప్ కేసులో చిక్కుకున్నాడు. దీంతో హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్‌కు బదిలీ అయ్యాడు. ఇపుడు పోలీసుల చేతికి చిక్కి జైలుపాలయ్యాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుజరాత్ రాష్ట్రానికి చెందిన కపిల్ కుమార్ అనే వ్యక్తి సీఐఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. గత యేడాది ఆగస్టు 22వ తేదీన హైదరాబాద్ నగరంలోని భారత డైనమిక్స్ లిమిటెడ్‌ నుంచి విశాఖలోని స్టీల్ ప్లాంట్‌కు బదిలీ అయ్యాడు. అక్కడ ఫైర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన ఫేస్‌బుక్‌లో తమీషా అనే మహిళ పరిచయమైంది. ఆ పరిచయం మరింత పెరిగి న్యూడ్ వీడియో కాల్స్ చేసుకునేంత వరకు వెళ్లింది. ఆ తర్వాత వీరిద్దరూ హైదరాబాద్ నగరంలోని భానూరులో ఓ గదిలో రహస్యంగా కలుసుకున్నారు. ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 
 
కాగా, తమీషా ఓ ఉగ్రవాద సంస్థ ముఖ్య నాయకుడి వద్ద పని చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో కపిల్ కుమార్ నుంచి భారత డైనమిక్స్, స్టీల్ ప్లాంట్‌కు చెందిన రహస్య సమాచారాన్ని ఆమె గత రెండేళ్లుగా అతడి నుంచి సేకరిస్తున్నట్టు నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. ఒక నంబరు నుంచి తరచుగా పాకిస్థాన్‌కు ఫోన్ కాల్స్ వెళుతున్నట్టు పసిగట్టిన నిఘా సంస్థలు పోలీసులకు ఉప్పందించాయి. దాంతో వారు కపిల్ కుమార్ ఫోనును స్వాధీనం చేసుకుని పరిశీలించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన వద్ద నుంచి మూడు ఫోన్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments