Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో మహిళ హత్య

ఠాగూర్
మంగళవారం, 6 మే 2025 (16:12 IST)
తెలంగాణా రాష్ట్రంలో పట్టపగలు, పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఓ మహిళ దారుణ హత్య జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ స్టేషన్ వద్ద ఓ కేసులో నిందితురాలిగా ఉన్న లక్ష్మి అనే మహిళను శ్రీరామ్ అనే వ్యక్తి గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఆస్తి తగాదాలపై గతంలో సారయ్య అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో లక్ష్మి నిబంధనల బెయిలుపై బయట ఉన్నారు. 
 
ఈ క్రమంలో ఆమె తన వ్యక్తిగత పనిమీద వెళుతుండగా మాటువేసిన శ్రీరామ్... గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు శ్రీరామ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని సమీప ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments