Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేధిస్తున్న ప్రియుడిని ఇంటికి పిలిచి హతమార్చిన ప్రియురాలు.. ఎక్కడ?

ఠాగూర్
గురువారం, 15 ఫిబ్రవరి 2024 (17:52 IST)
నిత్యం తన వెంటపడుతూ వేధిస్తున్న ప్రియుడిని ఇంటికిపిలిచిన ప్రియురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి హత్య చేసింది. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలం కమ్మరిపల్లిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కమ్మరిపల్లికి చెందిన మొగిలి సుగుణక్క - ఓదెలు దంపతుల కూతురు పద్మను 12 ఏళ్ల క్రితం మండలంలోని పొన్నారంవాసి బట్టె శేఖర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇదే గ్రామానికి చెందిన రామగిరి మహేందర్ (28) హార్వెస్టర్ డ్రైవర్‌గా పని చేసిన సమయంలో(ఐదేళ్ల క్రితం) పద్మతో పరిచయం ఏర్పడింది. ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఈ క్రమంలో గత నాలుగు నెలల క్రితం ఆమె మహేందర్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో తన భార్య తప్పిపోయిందని శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా గత నవంబరులో పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా భర్తతో ఉండేందుకు నిరాకరించి మహేందర్‌తో తిరిగి వెళ్లిపోయింది. ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో నెల క్రితం పద్మ కమ్మరిపల్లికి వచ్చి తల్లిగారితో ఉండసాగింది. 
 
అయితే, మహేందర్ మాత్రం ఆమెను వదిలిపెట్టలేక.. తరుచుగా ఇంటికి వచ్చి వేధింపులకు గురిచేయసాగాడు. దీంతో అతడిని వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని భర్తకు చెప్పడంతో శేఖర్ కమ్మరిపల్లికి వచ్చాడు. భర్త, తల్లిదండ్రులతో కలిసి అతడిని అంతమొందించాలని ప్లాన్ వేసింది. మంగళవారం రాత్రి పద్మ మహేందర్‌కు ఫోన్ చేసి ఇంట్లో ఎవరూ లేరని రావాలంది. దీంతో ఆగమేఘాలపై మహేందర్ కమ్మరిపల్లికి చెందిన కడారి శేఖర్, జాలంపల్లి సాయిరాజ్లతో కలిసి గ్రామంలోకి వచ్చాడు. 
 
ఇద్దరిని ఇంటి సమీపంలో ఉంచి పద్మ ఇంట్లోకి వెళ్లగా కంట్లో కారంచల్లి కర్రలతో చితకబాదడంతో మహేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని ఎడ్లబండిలో గ్రామ సమీపంలోని అటవీప్రాంతానికి తీసుకెళ్లి దహనం చేశారు. అంతకుముందు మహేందర్ అరుపులు, కేకలు విన్న బయట ఉన్న ఇద్దరు మృతుడి సోదరుడు రవీందర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అటవీ ప్రాంతానికి వెళ్లి దహనమవుతున్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రిక తరలించారు. కేసు నమోదు చేసి పద్మ, శేఖర్, మొగిలి ఓదెలు, సుగుణలను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments