Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పేరుతో వంచన.. మైనర్ బాలికను గర్భవతిని చేసిన టెన్త్ బాలుడు

Webdunia
ఆదివారం, 18 సెప్టెంబరు 2022 (16:02 IST)
పెళ్ళి చేసుుకుంటానని నమ్మించి మైనర్ బాలికను మరో మైనర్ బాలుడు గర్భవతిని చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టారు. ఇందులో సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో మైనర్ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తెలంగాణాలోని నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కోస్గి మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక తల్లిందడ్రులు హైదరాబాద్ నగరంలో ఉంటున్నారు. బాలిక మాత్రం చదువుకుంటూ కోస్గిలో తన అవ్వ దగ్గర ఉంటుంది. ఈ క్రమంలో ఈ బాలిక ఎదురింటిలో మరో మైనర్ బాలుడు ఉంటున్నాడు. టెన్త్ క్లాస్ చదువుతున్న ఈ బాలుడు.. ఎదురింటిలో ఉండే మైనర్ బాలికతో ప్రేమలోపడ్డాడు. ఈ ప్రేమ కాస్త హద్దులు దాటింది. ఫలితంగా శారీరకంగా ఒక్కటయ్యారు. దీంతో బాలిక గర్భందాల్చింది. 
 
ఆ తర్వాత ఆ బాలిక హైదరాబాద్‌లో తల్లిదండ్రుల వద్దకు వెళ్లగా వారు గుర్తుపట్టి నిలదీయడంతో అసలు విషయాన్ని వివరించింది. బాలికను వెంటబెట్టుకుని సొంతూరుకు వచ్చి గ్రామ పెద్దల ముందు పంచాయతీ పెట్టారు. ఇందులో సరైన న్యాయం జరగక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఆ బాలిక ఏడు నెలల గర్భవతి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

"కల్కి 2898 AD": ప్రభాస్ జపాన్ స్కిల్స్ అదుర్స్.. వీడియో వైరల్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

కాలికి గాయంతో జపాన్ పర్యటన రద్దు చేసుకున్న ప్రభాస్

యదార్థ సంఘటనలతో నేటివిటి కథ విడుదల-2 : చింతపల్లి రామారావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

తర్వాతి కథనం