Rajnath Singh, Shyama Devi, Prabhas
ఇటీవల అనారోగ్య కారణాలతో మరణించిన కృష్ణంరాజు కుటుంబాన్ని శుక్రవారం రాత్రి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కలిసి పరామర్శించారు. ఇదేరోజు భారతీయ జనతాపార్టీకి సంబంధించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో భాగంగా ఆయన హైదరాబాద్ వచ్చి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని జె.ఆర్.సి. ఫంక్షన్ హాల్లో బిజెపి ఏర్పాటు చేసిన సంపతా సభకు ఆయన హాజరయి కృష్ణంరాజుతో తనకు గల అనుబంధాన్ని నెమరేసుకున్నారు. ఢిల్లీలో ఎప్పుడు కలిసినా అన్నయ్యా! అంటూ ఆప్యాయంగా పలుకరించేవారని తెలిపారు.
ఢిల్లీనుంచి రాగానే ముందుగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవితో పాటు పిల్లలు, సినీ నటుడు ప్రభాస్‌ను కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశాను. కృష్ణంరాజు అజాశత్రువు. సర్వశక్తిమంతుడు వారికి ఈ స్మారక నష్టాన్ని భరించే శక్తిని ప్రసాదించుగాక అంటూ దేవుడ్ని వేడుకుంటూ రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు.