నటుడు రావు రమేష్ పర్సనల్ మేకప్ మెన్ బాబు మృతి చెందారు. పర్సనల్ మేకప్ మెన్ మృతి చెందడంతో వారి కుటుంబానికి రావు రమేష్ ఎంతో అండగా నిలిచారు. ఇన్ని రోజులపాటు తనకు ఎన్నో సేవలు చేసిన బాబు మృతి చెందడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
ఈ క్రమంలోనే రావు రమేష్ స్వయంగా తన ఇంటికి వెళ్లి బాబు కుటుంబ సభ్యులను ఓదార్చడమే కాకుండా వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.
అలాగే బాబు కుటుంబానికి ఈయన 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది నెటిజన్ లు రావు రమేష్ మంచి మనసుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.