అత్తను చంపేసిన అల్లుడు.... మంచిర్యాలలో దారుణం (Video)

వరుణ్
సోమవారం, 15 జులై 2024 (08:48 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. పిల్లనిచ్చిన అత్త పట్ల అల్లుడు కిరాతకంగా ప్రవర్తించాడు. తమ భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టిందన్న కోపంతో అత్తపై కత్తితో దాడి చేసి చంపేశాడు. ఈ దారుణం మంచిర్యాల, సున్నంబట్టివాడలో జరిగింది.  ఈ ప్రాంతానికి చెందిన నెల్లి విజయ అనే మహిళ కుమార్తె మాళవికను.. మంచిర్యాల పట్టణానికి చెందిన సాత్రం వెంకటేశ్‌ అనే వ్యక్తికి ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఈ దంపతులు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అత్త (విజయకు), అల్లుడు (వెంకటేశ్‌కు)కు మధ్య గొడవలు మొదలయ్యాయి. తమ సంసారంలో చిచ్చుపెట్టిందన్న ఆగ్రహించిన విజయ్.. అత్తపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విజయ ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయింది. ఆదివారం రాత్రి పీకల వరకు మద్యం సేవించి వచ్చిన వెంకటేశ్ ఈ కిరాతక చర్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత వెంకటేశ్ కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే, తను ప్రాణాపాయం నుంచి బయటపడగా, విజయ మాత్రం చనిపోయింది. స్థానిక పోలీసులు సమాచారం అందుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. విజయ మృతదేహాన్ని స్వాధీనం చేసుకోగా, వెంకటేశ్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 


సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments