Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలి భర్తను చంపేందుకు సుపారీ గ్యాంగ్‌తో కుట్ర... చివరకు...

ఠాగూర్
సోమవారం, 14 ఏప్రియల్ 2025 (08:44 IST)
తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ భర్తను చంపేందుకు ఓ వ్యక్తి కుట్రపన్నాడు. ఇందుకోసం సుపారీ గ్యాంగ్‌తో రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ, నగదు లావాదేవీల్లో తేడా రావడంతో ప్రియురాలి భర్తను హత్య చేయకుండా సుపారీ గ్యాంగ్ వదిలివేసింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది. 
 
పోలీసులు తెలిపిన వివరాల మేరకు... రాము అనే వ్యక్తికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ మహిళ భర్తను చంపేందుకు ఆమెతో కలిసి రాము కుట్రపన్నాడు. ఇందుకోసం ఓ సుపారీ గ్యాంగ్‌తో రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని, ముందుగా రూ.5 లక్షలు నగదు ఇచ్చాడు.  
 
సుపారీ గ్యాంగ్ బాధితుడుని కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, హత్య చేయడానికి ముందు రాముకు ఫోన్ చేసి మిగతా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా, రాము నిరాకరించాడు. దీంతో సుపారీ గ్యాంగ్ హత్యకు పూనుకోలేదు. పైగా బాధితుడు వద్ద ఉన్న నగదు, నగలను దోచుకున్నారు. 
 
దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగు చూసింది. హత్యకు ఒప్పందం చేసుకున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి మారణాయుధాలతో పాటు రూ.90 వేల నగదు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments