Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావే హంతకుడు : కోర్కె తీర్చలేదని పగబట్టి మరదలిని చంపేసిన అక్క భర్త..

Webdunia
గురువారం, 15 జూన్ 2023 (09:48 IST)
తన కోర్కె తీర్చలేదన్న అక్కసుతో మరదిలిని పగబట్టి మరీ హత్య చేశాడో అక్క భర్త. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన శిరీష్ హత్య కేసులో ప్రధాన సూత్రధారి బావేనని పోలీసులు తేల్చి, అరెస్టు చేశారు. కేవలం తన కోర్కెతీర్చకుండా తనకు ఎదురు తిరిగిందన్న అక్కసుతో ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు విచారణలో తేటతెల్లమైంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పరిగి మండలం కాల్లాపూర్ గ్రామానికి చెందిన శిరీష అనే యువతికి పొద్దస్తమానం ఫోనులోనే నిమగ్నమైవుండేది. దీంతో ఆమె వంట కూడా చేసేది కాదు. దీంతో ఈ నెల పదో తేదీన తండ్రి జంగయ్య, తమ్ముడు శ్రీనివాస్ ఆమెపై కోపగించుకున్నారు. ఈ విషయాన్ని 18 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న సొంత అక్క లలితకు శ్రీనివాస్ (శిరీష తమ్ముడు) ఫోను చేసి చెప్పాడు. లలిత తన భర్త ఎర్రగడ్డపల్లి అనిల్‌కు చెప్పగా ఆయన కూడా శిరీషకు ఫోన్ చేసి మందలించాడు. 
 
అయితే, తన బావ తిట్టడాన్ని శిరీష వ్యతిరేకించింది. దీంతో అదే రోజు రాత్రి కాళ్లాపూరు వచ్చి ఆమెను చితకబాదాడు. అపుడు తండ్రి కూడా శిరీషపై చేయి చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికు గురైన శిరీష... ఇంట్లోనే ఆత్మహత్యకు యత్నించడంతో వారు అడ్డుకున్నారు. ఈ విషయం సద్దుమణిగిందని అనిల్ తిరిగి పరిగికి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి అనంతరం శిరీష ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటి నుంచి గొళ్లెం పెట్టి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని మళ్లీ తమ్ముడు అక్కకు తెలిపాడు. 
 
వెంటనే భార్యతో కలిసి అనిల్ కాళ్లాపూర్‌కు వచ్చాడు. భార్యను ఇంట్లో వదిలి అతను బండిపై శిరీషను వెతగడం గాలించాడు. ఈ క్రమంలో ఇంటికి కి.మీ. దూరంలో రోడ్డుపై శిరీష కనిపించాడు. ఆ తర్వా వారిద్దరి మధ్య మాటా మటా పెరిగింది. కర్రతో, చేతులతో కొట్టడంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో మరింత కోపోద్రికుడైన అనిల్ అక్కడి నుంచి ఆమెను కొట్టుకుంటూ 150 మీటర్ల దూరంలో ఉన్న నీటి కుంట వద్దకు బలవంతంగా బండిలో పట్టుకెళ్లాడు. అక్కడ పగిలిన బీరు సీసాతో ఆమె కళ్లల్లో పొడిచి నీటిలో ముంచడంతో ఊపిరాడక చనిపోయింది. ప్రాణం పోయిందని నిర్ధారించుకున్న తర్వాత బీరు సీసాను నీటి కుంటలో పడేసి కాళ్ళాపూర్ వెళ్లకుండా పరిగిలోని ఇంటికి చేరుకున్నాడు. 
 
పోలీసులకు సరిగ్గా ఇక్కడే క్లూ చిక్కింది. అనుమానం వచ్చి పరిగికి ఎందుకు వెళ్లాడన్న కోణంలో దర్యాప్తును చేపట్టగా, అనిల్ చేసిన నేరాన్ని అంగీకరించాడు. నిందితుని వద్ద నుంచి సెల్‌ఫోన్, బైకును స్వాధీనం చేసుకున్నాడు. శిరీషపై లైంగిక వాంఛ తీర్చుకోవాలని ఏడాది కాలంగా అనిల్ పథకం పన్నాడు. ఓ దశలో పెళ్లి చేసుకోవాలని కూడా యత్నించాడు. అందుకు శిరీష అంగీకరించకపోవడంతో ఆమెపై పగబట్టి చంపేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం