Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డను దారికి తెచ్చుకునేందుకు ఉరేసుకుంటానని బెదిరించిన తల్లి.. చివరకు...

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (13:57 IST)
పాఠశాలకు వెళ్లనంటూ మారాం చేసిన బిడ్డను దారికి తెచ్చుకునేందుకు ఉరేసుకుంటానని బెదిరించిన ఓ తల్లి కథ చివరకు విషాదాంతంగా ముగిసింది. కాలు జారడంతో ఆమె మెడకు వేసుకున్న ఉరి కాస్త బిగుసుకుంది. దీంతో ఆ ఆమె కన్నబిడ్డ ముందే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కోయంబత్తూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా అప్పనేకర్ రోడ్డులో సుధాకర్, యమునాబాయి అనే దంపతులు ఉన్నారు. వీరికి 16, 14 వయస్సున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్దరూ ఇంటికి సమీపంలో ఉండే పాఠశాలలో చదువుకుంటున్నారు. అయితే, ఒక కుమారుడు స్కూలుకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నాడు. ఇది గత కొన్ని రోజులుగా సాగుతోంది. దీంతో కొడుకును దారికి తెచ్చుకునేందుకు యమునాబాయి... స్కూలుకు వెళ్లకుంటే ఉరేసుకుంటానని బెదిరించింది. 
 
దీనిని కొడుకు తేలిగ్గా తీసుకోవడంతో యమునాబాయి గొంతుకు ఉరితాడు బిగించుకుంది. ఆపై కొడుకును బెదిరిస్తుండగా, ఆమె కాలు జారింది. దీంతో మెడకు ఉరితాడు బిగుసుకుంది. కొడుకు పరుగెత్తుకుంటూ వెళ్లి చుట్టుపక్కల వారిని పిలుచుకుని వచ్చేలోపు యమునాబాయి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అయినప్పటికీ ఆమెను కిందికి దించి ఆస్పత్రికి తరలించగా, ఆమె చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. దీంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments