Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్టీ విద్యార్థిని కిడ్నాప్ చేసి చంపేశారు.. ఏలూరులో దారుణం!

Webdunia
బుధవారం, 12 జులై 2023 (09:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దళిత విద్యార్థి హత్యకు గురయ్యాడు. హాస్టల్‌లో ఉంటూ చదవుకుంటూ వచ్చిన ఈ బాలుడిని కొందరు దుండగులు కిడ్నాప్ చేసి అతి క్రూరంగా చంపేశారు. అర్థరాత్రి వేళ విద్యుత్ సరఫరా నిలిపివేసి హాస్టల్‌లోకి చొరబడిన దుండగులు ఆ బాలుడిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేసి పాఠశాల ఆవరణలో పడేశారు. బతకాలని అనుకున్నవారు వెళ్లాపోవాలని, లేదంటే ఇలాంటి సీన్లు రిపీట్ అవుతాయంటూ దండగులు ఓ లేఖ రాశారు. 
 
ఏలూరు జిల్లాలోని గిరిజన సంక్షేమ వసతిగృహంలో జరిగిన అత్యంత దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని బుట్టాయగూడెం మండలం పులిరాముడుగూడెంలో సోమవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. మన్యంలోని కుగ్రామమైన ఉర్రింకకు చెందిన గోగుల శ్రీనివాసరెడ్డి వలంటీరు. ఆయన భార్య రామలక్ష్మి ఆశా కార్యకర్త. వీరి ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి ఆరో తరగతి, చిన్నవాడైన అఖిలవర్థన్ రెడ్డి (9) నాలుగో తరగతి చదువుతున్నారు.
 
సోమవారం అర్థరాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో హాస్టల్లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు విద్యుత్ సరఫరా నిలిపివేసి అఖిలవర్ధన్ రెడ్డిని బలవంతంగా ఎత్తుకుని బయటకు తీసుకెళ్లారు. అనంతరం హత్య చేసి సమీపంలోని గిరిజన సంక్షేమ పాఠశాల ఆవరణలో పడేశారు. మృతదేహంపై ఉన్న ఆనవాళ్లను బట్టి బాలుడిని గొంతు నులిమి హత్య చేసినట్టు తెలుస్తోంది. 'బతకాలనుకున్నవారు వెళ్లిపోండి. ఎందుకంటే ఇక నుంచి ఇలాంటివి జరుగుతుంటాయి.. ఇట్లు.. ' అని రాసి వున్న లేఖను బాలుడి చేతిలో పెట్టి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. దీనిపై స్పందించిన జిల్లా అధికారులు పాఠశాల హెడ్మాస్టర్, వార్డెన్, వాచ్‌మెన్‌లను సస్పెండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments