Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి మోజులోపడి స్నేహితుడి ద్వారా భర్తకు సైనైడ్ ఇచ్చిన భార్య...

murder
Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (10:31 IST)
దేశంలో వివాహేతర సంబంధాల కారణంగా జరుగతున్న హత్యల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో ఓ వివాహిత ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తకు సైనైడ్ ఇచ్చి హతమార్చింది. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
గుజరాత్, జునాఘడ్ పట్టణానికి చెందిన రఫీక్, మొహమూదాలు అనే భార్య భర్తలు ఉన్నారు. అయితే, మొహమదాలుకూ ఆసిఫ్ చౌహాన్ అనే వ్యక్తితో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రియుడిపై చచ్చేటంత ప్రాణం పెట్టుకున్న మొహమదాలు ప్రియుడిని పెళ్లాడాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసి, తన మనస్సులోని ఆలోచనను ప్రియుడు ఆసిఫ్‌కు చెప్పింది. దానికి అతను కూడా సమ్మతించి, తన స్నేహితుడు ఇమ్రాన్ సాయం తీసుకున్నాడు. 
 
తమ పథకంలో భాగంగా ఇమ్రాన్‌తో సైనైడ్ తెప్పించి భర్త రఫీక్‌తో పాటు అతని స్నేహితుడు భరత్‌కు సైనైడ్ కలిపిన శీతలపానీయం ఇచ్చింది. ఈ కూల్‌డ్రింక్స్ సేవించగానే రఫీక్, భరత్‌లు స్పృహతప్పి పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఆ తర్వాత జరిపిన శవపరీక్షలో వారు తాగిన శీతలపానీయంలో విషం ఉన్నట్టు తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అసలు విషయం వెల్లడైంది. దీంతో హత్యకు కారణమైన మొహమూదా, ఆసిఫ్, ఇమ్రాన్‌లను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments