Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణం తీసిన ఫోను... హైదరాబాద్‌లో డెలివరీ బాయ్ మృతి

Webdunia
శనివారం, 9 డిశెంబరు 2023 (08:59 IST)
ఫోను ప్రాణం తీసింది. ఫోనులో మాట్లాడుతూ లిఫ్టులో ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ డెలివరీ బాయ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని మయూరీ నగర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మయూరీ నగర్‌లో నివాసముంటున్న జేమ్స్(38) అనే వ్యక్తికి భార్య ఇద్దరు, పిల్లలు ఉన్నారు. ఈయన స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ కొరియర్ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం అశోక్ నగరులోని నివాస్ టవర్స్ అనే అపార్టుమెంట్ నాలుగో అంతస్తులో డెలివరీ చేసిన పార్శిల్‌ను వెనక్కి తీసుకునేందుకు వచ్చాడు. 
 
పార్శిల్ తీసుకుని తిరిగి కిందికి వెళ్లేందుకు నాలుగో అంతస్తులోని లిఫ్ట్ గ్రిల్ డోర్ తెరిచారు. అప్పటికే ఫోనులో మాట్లాడుతూ అందులో లీనమైపోయాడు. ఫోన్ మాట్లాడుతుండటంతో లిఫ్ట్ పైకి రాని విషయాన్ని గమనించకుండా లిఫ్టు వచ్చిందన్న భావనతో కాలు లోపలికి పెట్టడంతో ఒక్కసారిగా మొదటి అంతస్తులో ఉన్న లిఫ్ట్ పై భాగంలో పడిపోయారు. 
 
ఈ విషయం తెలియని మరో అపార్టుమెంట్ వారు లిఫ్ట్ ఆన్ చేయడంతో లిఫ్టు పైకి వచ్చింది. ఆ లిఫ్టు పైభాగంలో ఉన్న స్లాబ్ తగలడంతో జైమ్స్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మూడో అంతస్తులో ఆగిపోవడంతో మెకానిక్ వచ్చి మరమ్మతులు చేస్తుండగా పై భాగంలో మనిషి చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్య జరిమా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ శుక్రవారం తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments