Webdunia - Bharat's app for daily news and videos

Install App

నర్సుతో అక్రమ సంబంధం : మృతదేహాన్ని ఏడు ముక్కలు చేసిన ప్రియుడు

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (08:01 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రామగుండంలో వివాహేతర సంబంధం ప్రియురాలి భర్తను ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. ఈ కిరాతకుడు మృతదేహాన్ని ఏడు ముక్కలు చేశాడు. ఈ దారుణం స్థానికంగా కలకలం రేపింది. దీంతో ఇటీవల సంచలనం రేపిన కాంపెల్లి శంకర్ అనే వ్యక్తి హత్య కేసులోని మిస్టరీ వీడిపోయింది. పైగా, హత్యకు సంబంధించి ఏ ఒక్క చిన్న ఆధారం లభించకుండా నిందితుడు డిటెక్టివ్ సినిమాను ఫాలో అయ్యాడు. మృతదేహాన్ని ఏడు ముక్కలుగా నరికి ఆ శరీర భాగాలను వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. రామగుండం ఎన్టీపీసీ ఖాజీపల్లికి చెందిన కాంపెల్లి శంకర్, హేమలత అనే దంపతులు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. అయితే, శంకర్ గోదావరి ఖనిలో మీ సేవ కేంద్రంలో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. హేమలత మాత్రం ఎన్టీపీసీ ధన్వంతరి దవాఖానాలో స్టాఫ్ నర్సుగా పని చేస్తుంది. 
 
ఈ క్రమంలో ఇదే ఆస్పత్రిలో పనిచేసే పొయ్యిల రాజుతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలియడంతో వారిద్దరి మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి. ఈ విషయాన్ని హేమలత తన ప్రియుడు రాజుకు చెప్పి బోరున విలపించింది. దీంతో తమ బంధానికి అడ్డుగా ఉన్న శంకర్‌ను హత్య చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. ఇందుకోసం రెండు కత్తులను కొనుగోలు చేసి సరైన సమయం కోసం కొన్ని రోజుల పాటు ఎదురు చూశాడు.
 
ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీ రాత్రి శంకర్ - హేమలతల మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఆ తర్వాత రాత్రి 10 గంటల సమయంలో భార్య హేమలతను శంకర్ తన బైకుపై ఆస్పత్రికి తీసుకెళ్లి దింపాడు. ఆ తర్వాత రాజుకు ఫోను చేసి నీ వల్లే తమ మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఇది మంచి పద్దతి కాదని వారించాడు. ఇదే అదునుగా భావించిన రాజు... శంకర్‌ను తన ఇంటికి రమ్మన్నాడు. 
 
అక్కడ వాకిద్దరూ అతిగా మద్యం సేవించారు. ఆ తర్వాత రాత్రి 11 గంటల సమయంలో శంకర్‌ను రాజు హత్య చేసి చంపేశాడు. ఆ తర్వాత డిటెక్టివ్, నా పేరు శివ సినిమాల తరహాలో సాక్ష్యాధారాలు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని ఏడు ముక్కలుగా చేశాడు. ఒక్కో ముక్కను ఒక్కో ప్రాంతంలో విసిరేశాడు. ఇంతవరకు సాఫీగానే సాగిపోయింది.
 
అయితే, తన కుమారుడు ఇంటికి రాకపోవడంతో మృతుని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... హేమలతను అదుపులోకి తీసుకుని విచారిస్తూనే, ఈ నెల 27వ తేదీ శంకర్ శరీర భాగాలను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకుని మిస్సింగ్ కేసును కాస్త హత్య కేసుగా మార్చారు. 
 
పైగా, హేమలతకు రాజుకు మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఆమె ప్రియుడు రాజును అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్ళగా, అప్పటికే రాజు బైకుపై కరీంనగర్ పారిపోతుండటాన్ని గమనించి, తెలంగాణ ప్రాజెక్టు చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments