Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య పేరుపై రూ.1.90 కోట్ల బీమా.. కారుతో తొక్కించి చంపిన భర్త

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (11:57 IST)
కట్టుకున్న భార్యపై ఉన్న రూ.1.90 కోట్ల బీమాను కొట్టేయాలన్న నిర్ణయానికి వచ్చిన భర్త ఆమెను దారుణంగా హత్య చేయించాడు. రాజస్థాన్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ రాష్ట్రానికి చెందిన చంద్ అనే వ్యక్తి షాలును గత 2015లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. రెండేళ్ళ తర్వాత వారి మధ్య పొరపొచ్ఛాలు వచ్చాయి. దీంతో షాలు తన పుట్టింటికి వెళ్లిపోయి అ్కకడే ఉంటుంది. 
 
గత 2019లో భర్తపై గృహహింస కేసు కూడా పెట్టింది. ఈ నేపథ్యంలో ఇటీవల షాలు పేరుపై చందు బీమా చేయించాడు. పైగా, తాను ఓ కోరిక కోరుకున్నానని, అది నెరవేరాలంటే 11 రోజుల పాటు ప్రతి రోజూ బైకుపై హనుమంతుడి గుడికి వెళ్ళాలని భార్యకు చెప్పాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని కూడా హెచ్చరించాడు. 
 
తన కోరిక నెరవేరిన వెంటనే ఇటికి తీసుకెళతానని భార్యకు హామీ ఇచ్చాడు. భర్త మాటలు నమ్మిన ఆమె ప్రతి రోజూ బైకు‌పై ఆంజనేయుడి గుడికి వెళ్లి రావడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో గత అక్టోబరు నెల 5వ తేదీన కజిన్ రాజుతో కలిసి ఆమె బైకుపై ఆలయానికి వెళ్ళింది. అప్పటికే అక్కడ ముగ్గురితో కలిసివున్న చందు... రాథోడ్ అనే రౌడీషటర్ కారుతో ఆమెను ఛేజ్ చేసి ఢీకొట్టించాడు. 
 
ప్రమాద సమయంలో రాథోడ్‌తో కలిసి కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. రాథోడ్, సోనులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఆ తర్వాత హత్య కోసం రూ.10 లక్షలతో ఒక ఒప్పందం కుదుర్చుకుని, ముందస్తు రుసుంగా రూ.5.5 లక్షలు చెల్లించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments