కూల్‌డ్రింక్స్‌లో మత్తు కలిపి పురుషుడుపై మహిళ అత్యాచారం ... ఎక్కడ?

ఠాగూర్
శనివారం, 6 డిశెంబరు 2025 (13:17 IST)
మహారాష్ట్రలో విచిత్ర ఘటన ఒకటి జరిగింది. పురుషుడుపై ఓ మహిళ అత్యాచారానికి పాల్పడింది. భార్య కేసులో సాయం చేస్తానని నమ్మిచిన నిందితురాలు ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటన పూణెలోని కోత్రుడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనిపై  బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితురాలిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు... ముంధ్వా ప్రాంతానికి చెందిన 37 యేళ్ల వ్యక్తికి కోత్రుడ్‌కు చెందిన 38 యేళ్ల మహిళతో పరిచయం ఏర్పడింది. తాను హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నానని ఆమె నమ్మించింది. బాధితుడిపై ఆయన భార్య పెట్టిన కేసులో న్యాయ సలహా ఇస్తూ అతనికి మరింత దగ్గరైంది. ఈ క్రమంలో అతనికి మత్తు కలిపిన శీతలపానీయం ఇచ్చి అత్యాచారానికి పాల్పడింది. ఇలా వేర్వేరు ప్రాంతాలకు పలుమార్లు తీసుకెళ్లి అతనిపై ఆ మహిళ అత్యాచారానికి పాల్పడింది. 
 
అసలు విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పైగా, వివాహం చేసుకోవాలంటూ నిందితురాలు ఒత్తిడి చేస్తోందంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. "నన్ను పెళ్లి చోసుకో లేదా రూ.2 లక్షలు ఇవ్వు. లేకపోతే నీపై అత్యాచారం కేసు పెట్టి జైలుకు పంపిస్తాను" అని బెదిరించినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: సంక్రాంతికి శర్వా చిత్రం నారి నారి నడుమ మురారి గ్రాండ్ రిలీజ్

NTR, Balayya: ఒకప్పడు అబ్బాయి, ఇప్పుడు బాబాయ్ కి సినిమా రిలీజ్ కస్టాలు

అఖండ 2 కు లాబాలు వచ్చినా ప్రొడ్యూసర్స్ కు అనుకోని ఆటంకాలు

ప్రేమించి మోసం చేసేవాళ్ళకు పుట్టగతులుండవ్ : నటి ఇంద్రజ శాపనార్థాలు

అఖండ-2 కష్టాలు ఇంకా తీరలేదు.. త్వరలో కొత్త రిలీజ్ తేదీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments