Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తాపూర్‌లో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించారు..

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (17:28 IST)
హైదరాబాద్ నగరంలోని అత్తపూర్‌లో దారుణం జరిగింది. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. కొందరు దుండగులు చేసిన ఈ దుశ్చర్య వల్ల స్థానికంగా కలకలం రేపింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రేమించిన మహిళ పెళ్లి చేసుకోమని గట్టిగా నిలదీయడంతో దారుణానికి ఒడిగట్టాడు. ఆమె గర్భవతి అని కూడా చూడకుండా పెట్రోల్ పోసి దహనం చేశాడు. 
 
ఈ ఘటన నాగర్ కర్నూల్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పెళ్లి చేసుకోమని ప్రియురాలు ఒత్తిడి తెస్తుండడంతో శ్రీశైలంలో చేసుకుందామని తీసుకువెళ్లి.. నల్లమల అడవుల్లో దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి కాల్చేశాడు. దీనికి సంబంధించి జడ్చర్ల సిఐ రమేష్ బాబు వివరాలను తెలిపారు..
 
నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం గొరిట నివాసి అయిన రత్నమ్మ (34)కు అప్పటికే వివాహమైంది. గొడవల కారణంగా మూడేళ్ల క్రితం భర్తతో విడిపోయి దూరంగా ఉంటుంది. జీవనం గడవడం కోసం కూలీ పనులకు వెళుతుండేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన లింగన్ చెన్నయ్యతో పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. 
 
ఈ క్రమంలోనే చెన్నయ్య మరో యువతిని వివాహం చేసుకున్నాడు. తనతో సంబంధం పెట్టుకుని మరో యువతిని ఎలా వివాహం చేసుకుంటావ్ అంటూ నిలదీసింది. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టడంతో ఆ సమయంలో లక్ష రూపాయల జరిమానా చెల్లించాడు. ఈ క్రమంలో గత యేడాది చెన్నయ్య భార్య గర్భంధరించడంతో మళ్ళీ లక్ష్మీకి దగ్గరయ్యాడు. దీంతో లక్ష్మీ కూడా గర్భందాల్చింది. 
 
ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భవతి. దీంతో తనను పెల్లి చేసుకోవాలని పట్టుబట్టింది. తన పేరిట రెండు ఎకరాల భూమి రాసి ఇవ్వాలని కోరింది. లేకపోతే, గ్రామంలోకి వచ్చి గొడవ చేస్తానని చెన్నయ్య మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో విసిగిపోయిన చెన్నయ్య ఎలాగైనా ఆమెని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. నువ్వు అడిగినట్టే పెళ్లి చేసుకుందామని శ్రీశైలానికి తీసుకువెళ్లాడు. 
 
ఈ ప్రకారం ఫిబ్రవరి 28న జడ్చర్ల నుంచి బైక్ మీద ఇద్దరు వెళ్లారు. దారిలో ఫరహాబాద్ - మన్ననూర్ మధ్యలో ఉన్న తాళ్లచెరువు దగ్గర నుంచి నల్లమల అడవిలోకి తీసుకువెళ్లాడు. ఆమె ఏదో అడిగేలోపే కర్రతో తల మీద భారీ గొంతు నులిమి చంపేశాడు. ముందే వేసుకున్న పథకం ప్రకారం బైక్‌లో ఉన్న పెట్రోల్ తీసి ఆమె మృతదేహంపై పోసాడు. ఆ తర్వాత నిప్పంటించి కాల్చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం