Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం తాగొద్దని భర్తను తిట్టిన భార్య... ప్రాణాలు తీసిన భర్త.. శవంతో ఇంట్లోనే ...

ఠాగూర్
శుక్రవారం, 15 మార్చి 2024 (08:55 IST)
మద్యం తాగొద్దని భర్తను భార్య మందలించింది. దీన్ని జీర్ణించుకోలేని భర్త.. ఆమెను కడతేర్చాడు. ఆ తర్వాత రెండు రోజుల పాట శవంతో ఇంట్లోనే ఉన్నాడు. ఇంటిలో ఒక గదిలో శవాన్ని దాచి మరో గదిలో ఉండసాగాడు. ఇంతలో ఊరి నుంచి వచ్చిన పెద్ద కుమారుడు.. గదిలోని తల్లి శవాన్ని గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం ఒరిస్సా రాష్ట్రంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మద్యం తాగొద్దని అసభ్యకరంగా తిట్టిందనే కారణంతో ఓ చెక్కతో భార్యను 48 యేళ్ల వ్యక్తి కొట్టి చంపేశాడు. శవాన్ని ఇంట్లోనే దాచివుంచాడు. ఆ తర్వాత తన ముగ్గురు మగ పిల్లల్లో ఒక కుమారుడు ఇంటికి రావడంతో తల్లి మృతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. శవాన్ని ఒక గదిలో దాచిపెట్టి తాళం వేశాడని, అయితే, దంపతుల 19 యేళ్ల పెద్ద కుమారుడు వారి స్వస్థలం గంజాం నుంచి ఇంటికి వచ్చి మృతదేహాన్ని గుర్తించాడని పోలీసులు వివరించారు. దీనిపై సమాచారం అందండంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. 
 
ఈ ఘటన ఒరిస్సా రాజాధాని భువనేశ్వర్ సమీపంలోని మైత్రి విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిందితుడు గంజాంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈయనకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ నెల 12వ తేదీన ఈ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో పీకల వరకు మద్యం సేవించి ఇంటికెళ్లిన భర్తను.. భార్య మందలించి పద్దతి మార్చుకోవాలని కోరుతూ అసభ్య పదజాలంతో దూషించింది. దీన్ని జీర్ణించుకోలేక ఆ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments