Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాయానగరంగా న్యూఢిల్లీ, ప్రతి 14 నిమిషాలకు ఓ కారు మాయం

ఐవీఆర్
గురువారం, 14 మార్చి 2024 (23:33 IST)
దేశ రాజధాని న్యూఢిల్లీ మాయానగరంగా మారుతోంది. అక్కడ ప్రతి 14 నిమిషాలకు ఓ కారు దొంగతనం జరుగుతోంది. దేశంలో జరుగుతున్న కార్ల దొంగతనాల్లో 80 శాతం ఢిల్లీలోనే జరుగుతున్నాయంటే కారు దొంగలు ఇక్కడ ఏ స్థాయిలో వున్నదో అర్థం చేసుకోవచ్చు. అక్నో డిజిటిల్ ఇన్సూరెన్స్ వెల్లడించిన నివేదికలో ఈ విషయాలు వెలుగుచూసారు. ఢిల్లీలో తమ కారును అపహరించుకుపోయారంటూ పోలీసు స్టేషన్లలో ప్రతిరోజు ఫిర్యాదు చేస్తున్నవారి సంఖ్య 105గా వున్నట్లు తేలింది. ఈ కేసులను చూస్తే.. గత ఏడాది కంటే రెండున్నర రెట్లు మేర కారు దొంగతనాలు జరిగినట్లు తేలిందని చెబుతున్నారు.
 
ఢిల్లీ నగరం తర్వాత రెండో స్థానంలో చెన్నై మహానగరం ఆక్రమించింది. చెన్నైలో 2022లో జరిగిన కారు దొంగతనాలు 5 శాతం వుంటే ఇప్పుడది 10.5 శాతానికి... అంటే దాదాపు రెట్టింపు అయ్యింది. ఇక మూడోస్థానంలో బెంగళూరు వున్నది. ఐతే హైదరాబాద్, కోల్ కతా వంటి నగరాల్లో కారు దొంగతనాలు అంతగా లేకపోవడం చూస్తుంటే ఇక్కడ పోలీసు భద్రత కట్టుదిట్టంగా వున్నట్లు అర్థమవుతుంది.
 
దొంగిలించబడుతున్న కార్లలో అత్యధికంగా వేగనార్, మారుతి స్విఫ్ట్, మారుతి డిజైర్, హుండయ్ ఐటెన్ కార్లు అధికంగా వుంటున్నట్లు తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన భాగస్వామిగా సరైన వ్యక్తిని ఎంచుకోకపోతే జీవితం నరకమే : వరుణ్ తేజ్

కోలీవుడ్‌లో విషాదం - ఢిల్లీ గణేశ్ ఇకలేరు...

సోనీ LIV ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్‌ ట్రైలర్‌ను ఆవిష్కరణ, నవంబర్ 15న ప్రసారం

హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ సికిందర్ షూటింగ్

శంకర్ గారితో పని చేయడం అదృష్టం: రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments