Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫ్రెండ్‌తో కలిసి బ్రేక్ ఫాస్ట్‌కు వెళుతుండగా ప్రమాదం.. గోవాలో నెల్లూరు యువతి మృతి

deadbody

ఠాగూర్

, మంగళవారం, 12 మార్చి 2024 (15:31 IST)
గోవాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరుకు చెందిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. తన స్నేహితుడితో కలిసి అల్పాహారం చేసేందుకు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. వారు ప్రయాణిస్తున్న స్కూటీ అదుపుతప్పి గోడను ఢీకొట్టింది. దీంతో ఆమె ఎగిరి కిందపడింది. ఆ సమయంలో వెనుకనే వస్తున్న కారు ఆమెపైకి దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆ వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. మంగళవారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గోవాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యువతి పూజిత దుర్మరణం చెందింది. స్నేహితుడితో కలిసి లంచ్ చేసేందుకు హోటల్ కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన పూజిత ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస వదలగా.. ఆమె స్నేహితుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
గోవాలని అంజునా పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని నెల్లూరుకు చెందిన పూజిత, హర్యానాకు చెందిన శివం ఉప్లాక్ష్ స్నేహితులు.. ఇద్దరూ గోవా ట్రిప్ కోసం వచ్చారు. స్థానికంగా బైక్స్ రెంట్‌కు ఇచ్చే ఓ షాప్‌లో స్కూటీని అద్దెకు తీసుకున్నారు. సోమవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు అంజునాలోని ఓ రెస్టారెంట్‌కు బయలుదేరారు. స్కూటీని శివం నడుపుతుండగా పూజిత వెనుక కూర్చుంది. 
 
స్టార్ కో జంక్షన్‌లో స్కూటీ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గోడను ఢీ కొట్టింది. దీంతో వెనుక కూర్చున్న పూజిత ఎగిరి రోడ్డుపై పడిపోయింది. వెనుకే వేగంగా వస్తున్న కారు ఆమెపై దూసుకెళ్లింది. అయినా డ్రైవర్ కారును ఆపకుండా ముందుకు పోనివ్వడంతో పూజిత శరీరం నలిగిపోయింది. దాదాపు వంద మీటర్ల వరకు కారు ఆమెను ఈడ్చుకెళ్లింది. శివం కూడా గాయాలపాలయ్యాడు. 
 
స్థానికులు వారిద్దరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. పూజిత అప్పటికే చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. శివంను ఎమర్జెన్సీ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా, పూజిత డెడ్ బాడీని బంబోలిమ్‌లోని మెడికల్ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామని, పోస్టుమార్టం చేశాక ఆమె కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అంజునా పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ సమ్రీన్ భవానీని అదుపులోకి తీసుకుని ప్రమాదం జరిగిన తీరుపై విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఏఏ.. ఈ చట్టం ఆమోదయోగ్యం కాదు.. నటుడు విజయ్