Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజోలులో గొల్లపల్లి ఓడిపోతారు, అందుకే నేను ఒప్పుకోను: జగన్ నిర్ణయంపై రాపాక ఆగ్రహం

Rapaka Vara Prasada Rao

ఐవీఆర్

, మంగళవారం, 12 మార్చి 2024 (14:14 IST)
కర్టెసి-ట్విట్టర్
ఏపీలో సీట్ల రగడ ప్రతి ఒక్క పార్టీకి తలనొప్పిగా మారుతోంది. తాజాగా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపికి ఈ తలనొప్పి ప్రారంభమైంది. గత ఎన్నికల్లో జనసేన తరపున గెలిచిన ఒకే ఒక్క సీటు ఇదే. ఈ స్థానం నుంచి రాపాక వరప్రసాదరావు జనసేన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కొద్దిరోజులకే వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. ఇక అప్పట్నుంచి అధికార పార్టీతోనే నడుస్తూ వచ్చారు.
 
ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సీఎం జగన్ మోహన్ రెడ్డి సిట్టింగ్ స్థానాల్లో పోటీ చేసేవారిలో కొందరికి ఉద్వాసన పలుకుతున్నారు. వారిలో రాపాక కూడా చేరిపోయారు. ఆయన పోటీ చేసిన రాజోలు నుంచి ఇటీవలే తెదేపా నుంచి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుని పోటీకి దింపుతూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై రాపాక తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
 
ఓడిపోయే అభ్యర్థిని తీసుకుని వచ్చి రాజోలు నుంచి పోటీ చేయిస్తే చూస్తూ వూరుకునేది లేదని చెబుతున్నారు. మరొక్కసారి సర్వే చేయించి గెలిచేది ఎవరో చూసి అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. తనను అమలాపురం ఎంపీగా పోటీ చేయమని చెబుతున్నారనీ, దానికి నేను సిద్ధమే కానీ రాజోలులో ఓడిపోయే అభ్యర్థిని దింపితే మాత్రం సహించలేమని అంటున్నారు. అవసరమైతే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమేనంటూ తెలియజేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోఫాపై షర్ట్ పెట్టాడని.. మామను ఘోరంగా కొట్టిన కోడలు (వీడియో)