Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అత్యాచారం.. గర్భవతి అని తెలియగానే సజీవంగా పాతిపెట్టేందుకు...

ఠాగూర్
శనివారం, 26 జులై 2025 (10:39 IST)
ఓ బాలికపై పలుమార్లు అత్యాచారం చేసిన కొందరు కామాంధులు ఆ బాలిక గర్భవతి అని తెలియగానే ఆమెను సజీవంగా పాతిపెట్టేందుకు యత్నించారు. ఈ దారుణ ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని జగత్ సింగ్ పూర్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని కుజంగ్ అనే ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికపై పలుమార్లు అత్యాచారానికి తెగబడ్డారు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఈ విషయం తెలుసుకున్న కామాంధులు... ఆ బాలికను నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సజీవంగా పాతిపెట్టేందుకు యత్నించారు. నిర్మానుష్య ప్రాంతంలో తవ్విన గుంతను చూసిన ఆ బాలిక భయభ్రాంతులకుగురై ఆ కామాంధుల నుంచి ఎలాగోలా తప్పించుకుని ఇంటికి వచ్చింది. 
 
ఆ తర్వాత జరిగిన విషయం ఇంట్లో చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ బాలికను ఆస్పత్రికి తరలించి, నిందితులను అరెస్టు చేశారు. వీరిని స్థానికంగా ఉండే భాగ్యధర్ దాస్, పంచనన్ దాస్‌ అనే సోదరులతో పాటు వారి స్నేహితుడు తుళు బాబుగా గుర్తించారు. అన్నదమ్ములను అరెస్టు చేసిన పోలీసులు... పరారీలో ఉన్న తుళు బాబు కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం