Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంచలనం రేపుతున్న విద్యార్థిని రితీసాహు మృతి కేసు

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2023 (17:18 IST)
ఇటీవల విశాఖపట్టణంలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని రితీ సాహు కేసు ఇపుడు సంచలనంగా మారింది. ఈ మృతిపై ఉన్న మిస్టరీని ఛేదించేందుకు సీఐడీని ఆదేశించినట్టు తెలుస్తుంది. దీంతో వెస్ట్ బెంగాల్ సీఐడీ పోలీసులు రంగంలోకి దిగారు. 
 
గత నెల 14వ తేదీన రితీసాహు భవనంపై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయారు. ఈమె స్వస్థలం వెస్ట్ బెంగాల్. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా, ఈ మృతిపై విశాఖ పోలీసుల తీరుపై మృతురాలి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. నాలుగో పట్టణ పోలీసులు కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. 
 
హాస్టల్ యాజమాన్యం నుంచి లంచం తీసుకుని కేసును తప్పుదారి పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా సీసీటీవీ ఫుటేజీలోని లొసుగులపై నాలుగో పట్టణ సీఐపై బదిలీ వేటు పండింది. దీంతో ఈ కేసులో నాలుగో పట్టణ పోలీసుల వద్ద వెస్ట్ బెంగాల్ సీఐడీ పోలీసులు విచారణ జరుపనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments