Webdunia - Bharat's app for daily news and videos

Install App

వితంతు పింఛను ఆశ చూపి.. మహిళపై అత్యాచారం... కాకాణి అనుచరుడి అరెస్టు!!

ఠాగూర్
మంగళవారం, 24 డిశెంబరు 2024 (15:04 IST)
వితంతు పింఛన్ ఇప్పిస్తానని నమ్మించి ఓ వితంతువుపై అత్యాచారం చేసిన కేసులో వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరుడుని నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. భర్త చనిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురైన ఆ మహిళను వితంతు పింఛన్, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఆశపెట్టి పలుమార్లు అత్యాచారం చేశాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం రాత్రి నిందితుడుని అరెస్టు చేశారు. పేరు వెంకట శేషయ్య. 
 
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ మహిళ భర్త చనిపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతుండడం గమనించి ఉద్యోగం ఇప్పిస్తానంటూ వెంకట శేషయ్య మాయమాటలు చెప్పి వశపరుచుకున్నాడు. ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత రోజూ ఫోన్ చేస్తూ తన కోరిక తీర్చాలని వేధించాడని బాధితురాలు తెలిపింది. 
 
పైగా, తెల్లకాగితంపై సంతకం చేయించుకుని నిత్యం బెదిరించేవాడని ఆరోపించింది. వెంకట శేషయ్య వేధింపులు తట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఉద్యోగం ఇప్పిస్తానని వెంకట శేషయ్య తనను మోసం చేశాడని, పలుమార్లు తనపై లైంగిక దాడి చేశాడని ఫిర్యాదు చేసింది. దీంతో సోమవారం రాత్రి వెంకట శేషయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
వెంకట శేషయ్యను అరెస్టు చేశారని తెలిసి మాజీ మంత్రి కాకాణి అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. దీంతో నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు వివరాలను వివరించి అందరినీ అక్కడి నుంచి పంపించివేశారు. ఆపై వెంకట శేషయ్యను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు పూర్తయ్యాక కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం