Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అడిలైడ్ టెస్ట్ మ్యాచ్ : 180 పరుగులకు భారత్ అలౌట్

test india

ఠాగూర్

, శుక్రవారం, 6 డిశెంబరు 2024 (15:36 IST)
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు శుక్రవారం నుంచి ఆతిథ్య కంగారులతో అడిలైడ్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్‌ను ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ 44.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్‌ రెడ్డి (42) టాప్‌ స్కోరర్‌గా నిలవడం గమనార్హం. ఆసీస్‌ పేసర్ మిచెల్ స్టార్క్ (6/48) దెబ్బకు భారత టాప్ ఆటగాళ్లు తబడ్డారు. అలాగే, కమిన్స్ 2, స్కాట్ బోలాండ్ 2 వికెట్లు తీశారు. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 37, శుభ్‌మన్‌ గిల్ 31, అశ్విన్ 22, రిషభ్‌ పంత్ 21 పరుగులు చేశారు. యశస్వి, హర్షిత్, బుమ్రా డకౌట్‌ కాగా.. విరాట్ కోహ్లీ 7, రోహిత్ 3 విఫలమయ్యారు. సిరాజ్‌ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
 
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పరుగుల ఖాతా తెరవకుండానే మిచెల్ స్టార్క్ బంతికి వికెట్ల ముందు చిక్కిపోయాడు. ఈ దశలో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్, శుభమన్ గిల్‌ల జోడీ రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. అయితే, 12 పరుగుల తేడాతో రాహుల్, విరాట్ కోహ్లీ, గిల్‌ల వికెట్లను భారత్ చేజార్చుకుంది. రాహుల్ 37, గిల్ 31 పరుగులు చేయగా, కోహ్లీ 7 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ 21 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన 23 బంతులను ఎదుర్కొని కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. 
 
ఇక తొలి టెస్ట్ మ్యాచ్‌లో తన డైనమిక్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న తెలుగుదేశం నితేశ్ రెడ్డి మరోమారు బ్యాట్‌తో రాణించాడు. లోయర్ ఆర్డర్‌ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి బౌండరీల మోత మోగించి 54 బంతుల్లో 3 ఫోర్లతో  సాయంతో 42 పరుగులు చేశాడు. నితీశ్‌కు తోడు మరో ఎండ్‌లో రవిచంద్రన్ అశ్విన్ 22 పరుగులు చేయడంతో టీమిండియాకు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. చివర్లో హర్షిత్ రాణా (0), జస్ప్రీత్ బుమ్రా (0) డకౌట్ అయ్యారు. నితీశ్ రెడ్డి ఆఖరి వికెట్‌గా వెనుదిరగడంతో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దిగివచ్చిన పాకిస్థాన్.. అప్పటివరకు హైబ్రిడ్ విధానంలోనే మ్యాచ్‌ల నిర్వహణ