మీర్ పేట మాధవి హత్య కేసు: నాకు బెయిల్ వద్దు, లాయర్లు వద్దు అని న్యాయమూర్తి ఎదుట గురుమూర్తి

ఐవీఆర్
బుధవారం, 29 జనవరి 2025 (21:45 IST)
Accused Gurumurti
సంచలనం సృష్టించిన మాధవి హత్య కేసు నిందితుడు గురుమూర్తికి రంగారెడ్డి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీనితో అతడిని చర్లపల్లి జైలుకి తరలించారు. కోర్టులో జడ్జి ఎదుట తనకు బెయిల్ వద్దు, నా తరపున వాదించేందుకు న్యాయవాదులు వద్దు అని చెప్పాడు.
 
హైదరాబాద్ నగరంలోని మీర్‌‍పేటలో భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో నిందితుడు, ఆర్మీ మాజీ ఉద్యోగి గురుమూర్తి నేరాన్ని అంగీకరించాడు. ఈ నెల 16వ తేదీన మాధవిని హత్య చేసిన విధానాన్ని పూసగుచ్చినట్టు వివరించాడు. భార్యను చంపాననే పశ్చాత్తాపం రవ్వంతైనా లేదు. భార్య వెంకట మాధవి(35)ని అత్యంత క్రూరంగా చంపేశాడు. గుండెలపై కూర్చొని గొంతు నులిమి హత్య చేసినట్లు దర్యాప్తులో నిందితుడు చెప్పిన విషయాలు విని పోలీసులు నివ్వెరపోయారు. 
 
సంక్రాంతి పండుగ కోసం గురుమూర్తి, వెంకట మాధవి దంపతులు వారి పిల్లలతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లారు. భార్యను చంపాలని అప్పటికే ప్లాన్ వేసుకున్న గురుమూర్తి... పిల్లల ఎదురుగా భార్యపై దాడి చేస్తే అందరికీ తెలుస్తుందని భావించాడు. అందుకే పిల్లలను చుట్టాల ఇంటి వద్దే వదిలిపెట్టాడు. ఇంటికి వచ్చాక తొలుత భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె తలను గోడకేసి బలంగా కొట్టాడు. దాంతో ఆమె తలకు దెబ్బ తగిలి కిందపడిపోయింది. ఆమె మీద కూర్చుని గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న కత్తితో కాళ్లు, చేతులు, ఇతర అవయవాలు, తల కట్ చేశాడు. వాటిని నీళ్లలో వేసి హీటర్ సాయంతో ఉడికించాడు. 
 
ఉడికించిన అవయవాలను స్టవ్ పై కాల్చాడు. ఎముకలు కాలేదాకా వేడి చేసి వాటిని పొడి చేశాడు. ఆ రోజు సాయంత్రం వాటిని ఓ పెయింట్ బకెట్‌లో వేసుకుని జిల్లెలగూడ చెరువులో కలిపేశాడు. ఇంటికి వచ్చి కొంత మేర క్లీన్ చేశాడు. ఆ తర్వాత బంధువుల ఇంటికి వెళ్లి పిల్లలను తీసుకువచ్చాడు. అమ్మ ఏదని పిల్లలు అడిగితే... బయటికి వెళ్లిందని చెప్పాడు. అయితే హత్య చేసిన బెడ్రూం వైపు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తపడ్డాడు. ఇలా రెండు రోజుల తర్వాత వెంకట మాధవి తల్లిదండ్రులు వచ్చి అడిగారు. చివరికి వాళ్ల అమ్మ వచ్చి తమ కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు.
 
ఈ హత్య కేసులో ఆధారాలు సేకరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. హత్య చేసిన వాళ్లు ఎక్కడో చిన్న తప్పు చేసి దొరికిపోతారు. ఈ కేసులో కూడా గురుమూర్తి అలాగే దొరికిపోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments