Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

మీర్‌పేట హత్య : పోలీసులం సరిగా వివరించలేకపోవచ్చు కానీ, జర్నలిస్టులు సరిగ్గా వివరించగలరు..

Advertiesment
gurumurthi

ఠాగూర్

, మంగళవారం, 28 జనవరి 2025 (18:52 IST)
హైదరాబాద్ నగరంలోని మీర్‌‍పేటలో భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో నిందితుడు, ఆర్మీ మాజీ ఉద్యోగి గురుమూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద జరిగిన విచారణలో నేరాన్ని అంగీకరించాడు. హత్య చేసిన విధానాన్ని పూసగుచ్చినట్టు వివరించాడు. భార్యను చంపాననే పశ్చాత్తాపం రవ్వంతైనా లేదు. భార్య వెంకట మాధవి (35)ని అత్యంత క్రూరంగా చంపేశాడు. గుండెలపై కూర్చొని గొంతు నులిమి హత్య చేసినట్టు సీపీ సుధీర్ బాబు వివరించారు. దర్యాప్తులో నిందితుడు చెప్పిన విషయాలు విని తామే నివ్వెరపోయినట్టు చెప్పారు. 
 
సీపీ సుధీర్ బాబు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, 'సంక్రాంతి పండుగ కోసం గురుమూర్తి, వెంకట మాధవి దంపతులు వారి పిల్లలతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లారు. భార్యను చంపాలని అప్పటికే ప్లాన్ వేసుకున్న గురుమూర్తి... పిల్లల ఎదురుగా భార్యపై దాడి చేస్తే అందరికీ తెలుస్తుందని భావించాడు. అందుకే పిల్లలను చుట్టాల ఇంటి వద్దే వదిలిపెట్టాడు. 
 
ఇంటికి వచ్చాక తొలుత భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె తలను గోడకేసి బలంగా కొట్టాడు. దాంతో ఆమె తలకు దెబ్బ తగిలి కిందపడిపోయింది. ఆమె మీద కూర్చుని గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న కత్తితో మొదట కాళ్లు కట్ చేశాడు, ఆ తర్వాత చేతులు, ఇతర అవయవాలు, తల కట్ చేశాడు. వాటిని నీళ్లలో వేసి హీటర్ సాయంతో ఉడికించాడు. 
 
ఓ వ్యక్తి ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తాడో మాకు అర్థం కాలేదు. ఉడికించిన అవయవాలను స్టవ్ పై కాల్చాడు. ఎముకలు కాలేదాకా వేడి చేసి వాటిని పొడి చేశాడు. ఆ రోజు సాయంత్రం వాటిని ఓ పెయింట్ బకెట్‌లో వేసుకుని జిల్లెలగూడ చెరువులో కలిపేశాడు. ఇంటికి వచ్చి కొంత మేర క్లీన్ చేశాడు. 
 
ఆ తర్వాత బంధువుల ఇంటికి వెళ్లి పిల్లలను తీసుకువచ్చాడు. అమ్మ ఏదని పిల్లలు అడిగితే... బయటికి వెళ్లిందని చెప్పాడు. అయితే హత్య చేసిన బెడ్రూం వైపు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తపడ్డాడు. ఇలా రెండు రోజుల తర్వాత వెంకట మాధవి తల్లిదండ్రులు వచ్చి అడిగారు. చివరికి వాళ్ల అమ్మ వచ్చి తమ కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశాం.
 
ఈ హత్య కేసులో ఆధారాలు సేకరించేందుకు తీవ్రంగా శ్రమించాం. హత్య చేసిన వాళ్లు ఎక్కడో చిన్న తప్పు చేసి దొరికిపోతారని మాకు ట్రైనింగులో నేర్పించారు. ఈ కేసులో కూడా గురుమూర్తి అలాగే దొరికిపోయాడు. అతడు హత్య చేసిన విధానం ఎంత దారుణంగా ఉందంటే... మేం పోలీసులం సరిగా వివరించలేకపోవచ్చు కానీ, మీరు జర్నలిస్టులు సరిగ్గా వివరించగలరు అని సీపీ సుధీర్ బాబు వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవార్డుల కోసం గద్దర్ పనిచేయలేదు : కుమార్తె వెన్నెల (Video)