ఇంటర్ విద్యార్థిని స్నేహితుడి గదికి తీసుకెళ్లి హత్యాచారం చేసిన ట్రాక్టర్ డ్రైవర్

ఠాగూర్
బుధవారం, 8 అక్టోబరు 2025 (09:58 IST)
ఇంటి నుంచి కాలేజీకి బయలుదేరిన ఓ విద్యార్థినిని ఓ ట్రాక్టర్ డ్రైవర్ మాయమాటలు చెప్పి తన వశపరుచుకున్నాడు. ఆ తర్వాత తన స్నేహితుని గదికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆపై ఆమెను హత్య చేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నల్గొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (16) స్థానికంగా ఉండే ఓ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన బాలిక బాబాయికి ట్రాక్టర్ ఉంది. సమీప గ్రామానికి చెందిన గడ్డం కృష్ణ (22) ఆ ట్రాక్టరుకు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు ట్రాక్టర్ యజమాని ఇంటికి అప్పుడప్పుడు వచ్చిన సమయంలో బాలికతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 
 
ఈ క్రమంలో మంగళవారం ఉదయం బాలిక కాలేజీకని చెప్పి బయలుదేరింది. నల్గొండ చేరుకున్నాక.. కృష్ణ తన స్నేహితుడైన ఆటో డ్రైవర్ మధును పంపించి బాలికను తీసుకురమ్మన్నాడు. డైట్ కళాశాల ప్రాంతంలో మధు తాను నివసిస్తున్న గదికి బాలికను ఆటోలో తీసుకొచ్చాడు. తర్వాత కృష్ణ ఆమెపై అత్యాచారం.. అనంతరం హత్య చేసి పరారయ్యాడు. 
 
స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు నల్గొండకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణ, మధులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ దారుణంలో ఎవరెవరి పాత్ర ఉందని దర్యాప్తు చేస్తున్నారు. తీవ్ర రక్తస్రావం కారణంగా ఆందోళన చెందడంతో బాలిక మరణించిందని నిందితుడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. నిందితుడు గడ్డం కృష్ణపై పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments