Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో బాలికకు మత్తిమందిచ్చి అత్యాచారం..

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (09:15 IST)
హైదరాబాద్ నగరంలో మరో బాలిక అత్యాచారానికి గురైంది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనపై మరువక ముందే ఓల్డ్ సిటీలో ఇలాంటి దారుణం ఒకటి జరిగింది. చంచల్‌గూడకు చెందిన ఓ బాలికను ఇద్దరు కామాంధులు కిడ్నాప్ చేసి మత్తుమందిచ్చి అత్యాచారం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చంచల్‌గూడకు చెందిన ఓ బాలిక ఈ నెల 12వ తేదీన కిరాణా కొట్టుకు వెళ్లేందుకు ఇంటికి నుంచి బయటకు వచ్చింది. ఆ సమయంలో ఓ కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆ బాలికను కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. బాలిక ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లింద్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీన బాధిత బాలిక ఎంజీబీఎస్ నాలా వద్ద ఉన్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అస్సలు విషయం వెల్లడైంది. ఆమె ఇచ్చిన సమాచారం. మేరకు షా కాలనీకి చెందిన సయ్యద్ నేమత్ అహ్మద్ (26), సయ్యద్ రవీష్ అహ్మద్ మెహదీ (20) అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. 
 
రెండు రోజుల పాటు స్రుజన స్టే ఇన్ హోటల్ (ఓయో), మరో మూడు త్రీ క్యాస్టిల్ డీలక్స్ (ఓయో) లాడ్జీల్లో తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు నిందితులు అంగీకరించారు. ఆమెకు మత్తు మాత్రలు ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో వారిని అరెస్టు చేసిన కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం