Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికకు 15 - బాలుడికి 17 : ప్రేమ పేరుతో ఒక్కటైన జంట - ఆపై గర్భం

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (08:14 IST)
విశాఖపట్టణం జిల్లా చింతపల్లి మండలంలో దురదృష్టకర ఘటన జరిగింది. 15 యేళ్ళ బాలికను 17 యేళ్ల బాలుడు గర్భవతిని చేశాడు. ప్రస్తుతం ఆ బాలిక 8 నెలల గర్భవతి. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు హతాశులైపోయారు. దీనిపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి బాలుడిని అరెస్టు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని చింతపల్లి మండలోని తాజంగి పంచాయతీ పరిధిలోని బోయపాడు గ్రామానికి చెందిన 15 యేళ్ళ బాలిక స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి వరకు చదివి ఇంటిపట్టునే ఉంటుంది. అదే గ్రామానికి చెందిన 17 యేళ్ల బాలుడు ఇంటర్ పూర్తి చేసి ఇంటివద్దనే ఉంటున్నాడు. 
 
ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ ఏకాంతంగా శారీరకంగా కలుసుకుంటూ వచ్చారు. దీంతో ఇటీవల ఆ బాలిక అనారోగ్యానికి గురికావడంతో తల్లి నర్సీపట్నం ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ బాలికను పరిశీలించిన వైద్యులు... ఆమె ఎనిమిది నెలల గర్భవతి తేల్చారు. 
 
వైద్యులు నోటి వెంట తమ కుమార్తె గర్భవతి అనే మాట రాగనే తల్లిదండ్రులిద్దూ హతాశులై అక్కడే కుప్పకూలిపోయారు. ఆ తర్వాత తేరుకుని బాలుడుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు... బాలుడుని అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం