Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు డ్రైవర్ ఎంత పని చేసాడు? కోటీశ్వరుడి కూతురుని ట్రాప్‌లో పడేసి...

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (23:26 IST)
తండ్రి బాగా సంపాదించాడు. ఒకే ఒక్క కూతురు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాడు. కాలేజీకి కారులో పంపించేవాడు. ఏ లోటు రాకుండా చూసుకునేవాడు. అయితే యువతి మాత్రం కారు డ్రైవర్‌ను ప్రేమించింది. అతనే  సర్వస్వం అనుకుంది. తల్లిదండ్రులకు చెప్పకుండా వివాహం చేసుకుంది. అప్పటికే ఆ కారు డ్రైవర్‌కు పెళ్ళయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా సరే రెండో భార్యగా ఉంటానంటోంది యువతి.

 
కర్ణాటక రాష్ట్రం విజయపురజిల్లా జాలగేరి గ్రామానికి చెందిన సోమలింగ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పారిశ్రామికవేత్తగా స్థిరపడ్డ రంజిత్ ఇంట్లో పనిచేస్తున్నాడు. కారు డ్రైవర్‌గా సుమారు 8 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారు. 

 
ఈ క్రమంలో రంజిత్ కుమార్తెతో అతనికి పరిచయం ఏర్పడింది. కారులోనే కాదు అప్పుడప్పుడు బైక్ పైనా కాలేజీలో వదిలిపెట్టేవాడు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఒకరకంగా ట్రాప్ చేసి ఆమెను లైన్లో పెట్టాడు. అంతటితో ఆగలేదు. తీసుకెళ్ళి పెళ్ళి చేసేసుకున్నాడు. ఇంకేముంది తల్లిదండ్రులు పరుగును వచ్చారు. ఎందుకిలా చేశావంటూ కుమార్తెను ప్రశ్నించారు.

 
గొడవపడ్డారు. అయితే సోమలింగ అసలు విషయాన్ని కూడా చెప్పేశాడు. తనకు ఇప్పటికే పెళ్లయ్యిందని.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు షాక్. అయితే యువతి మాత్రం సైలెంట్ గానే ఉండిపోయింది. రెండవ భార్యగా మీ దగ్గరే ఉంటానంటూ నిలబడింది. 

 
దీంతో పోలీసులు ఆ యువతిని సోమలింగతోనే పంపించేశారు. సోమలింగ మొదటి భార్య అతనితో గొడవపడి తన తల్లిదండ్రులకు వెళ్లిపోయింది. అయితే తాను పెళ్ళి చేసుకున్న రెండవ యువతిని బాగా చూసుకుంటానని చెబుతున్నాడు సోమలింగం. కానీ తన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వనంటున్నాడు యువతి తండ్రి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments