Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుడితో ఎంజాయ్ చేస్తూ వీడియోలు తీసిన వివాహిత, పెళ్లి చేసుకోవాలంటూ బ్లాక్‌మెయిల్...

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (19:53 IST)
పెళ్లయింది. ఇంకా పిల్లలు లేరు. భర్త ఇంటిపట్టున ఉండకుండా మద్యానికి బానిసై బయట తిరుగుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా భర్త వినిపించుకోకుండా తనకు శారీరక సుఖాన్ని ఇవ్వకపోవడంతో భార్య ఆవేదనకు గురైంది. దాంతో ఒక యువకుడితో పరిచయం పెంచుకుంది. అతనికి తెలియకుండా వీడియోలను తీసింది. తనతో జీవితాంతం ఉండాలని పెళ్ళి చేసుకోకూడదని షరతులు విధించింది. దీంతో ఆమెకు యువకుడు భయపడి ఆమెను అతి దారుణంగా హత్య చేశాడు.
 
ఇలాంటి దారుణ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. గుమ్లా జిల్లాలోని మెరల్ పంచాయతీ కుదర్ అనే గ్రామంలో దేవి అనే మహిళతో ఒక వ్యక్తికి వివాహం జరిగింది. కొంతకాలం వీరి వైవాహిక జీవితం బాగానే సాగినా పిల్లలు పుట్టలేదని బాధతో భర్త మద్యానికి బానిసయ్యాడు.
 
దీంతో అతడి భార్య, రాజేంద్ర అనే వ్యక్తితో పరిచయం ఏర్పరచుకుంది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. యువకుడు ఎక్కడ తనకు దూరమై పోతాడేమోనన్న భయంతో ఆ వివాహిత శృంగారంలో తాను పాల్గొన్న వీడియోలను రహస్యంగా తీసింది.
 
అయితే ఈమధ్యనే రాజేంద్రకు ఇంట్లో పెద్దలు వివాహం నిశ్చయించారు. ఎవరిని వివాహం చేసుకోకూడదని.. తనను తప్ప ఎవరితోనూ కలవకూడదని ఆమె షరతులు పెట్టింది. అంతేకాకుండా తనతో కలిసిన వీడియోలను చూపించింది. దీంతో షాక్ అయిన రాజేంద్ర ఆమెను ఎలాగైనా చంపేయాలని ప్లాన్ వేసాడు.
 
రాత్రిపూట ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ వివాహితను కిడ్నాప్ చేసి స్నేహితుల సహాయంతో గొంతు నులిమి హత్య చేసి చెరువులో పడేసాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.. దీంతో అసలు విషయం బయటపడింది. రాజేంద్రతో పాటు హత్యకు సహకరించిన అతని స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments