Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 యేళ్ళ బాలికపై మేనమామ అత్యాచారం.. ఆపై.. నోట్లో యాసిడ్ పోసి..

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (09:01 IST)
అభంశుభం తెలియని ఓ చిట్టితల్లి పాలిట మేనమామ యముడయ్యాడు. ఆ కామాంధుడి కంబంధ హస్తాల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. అప్పటికీ వదిలి పెట్టని ఆ కామమృగం.. ఆ బాలికను పట్టుకుని నోట్లో యాసిడ్ పోశాడు. దీంతో ఐదు నెలల పాటు ఆ చిన్నారి మృత్యువుతో పోరాడింది. చివరకు ప్రాణాలు విడిచింది. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే,
 
ఈ గ్రామానికి ఓ మాజీ ఉపాధ్యాయుడికి తొలుత కుమారుడు పుట్టగా 18 యేళ్ల వయసులో చనిపోయాడు. ఆ తర్వాత చాలా కాలానికి కుమార్తె పుట్టింది. ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. గత యేడాది సెప్టెంబరు 5వ తేదీన కుటుంబ సభ్యులు నెల్లూరుకు వెళ్లగా, బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది. ఇదే అదునుగా భావించిన మేనమామ వరుసయ్యే కామాంధుడు ఆ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ క్రమంలో అతని నుంచి తప్పించుకుని, మరుగుదొడ్డిలో దాక్కుంది. అప్పటికీ వదిలిపెట్టలేదు. 
 
తలుపులు పగులగొట్టి చిన్నారి కేకలు వేయకుండా అక్కడే ఉన్న యాసిడ్‌ను నోట్లో పోశాడు. దీంతో చిన్నారి విలవిల్లాడింది. ఐదు నెలలపాటు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రాస్టిక్ సర్జరీ చేసి ముఖాన్ని పాత స్థితికి తెస్తామని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించారు. కానీ, వారి కలలు ఆవిరయ్యాయి. బాధితురాలు మంగళవారం ప్రాణాలు విడిచింది. ఈ విషయంపై దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments