Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసిన బాధితురాలినే పెళ్లి చేసుకున్న నిందితుడు.. అయినా జైలులోనే...

ఠాగూర్
బుధవారం, 30 ఏప్రియల్ 2025 (08:54 IST)
పెళ్లి పేరుతో అత్యాచారం చేసిన బాధితురాలినే విచారణ ఖైదీగా జైలులో ఉన్న నిందితుడు జైలు ప్రాంగణంలోనే వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒరిస్సాలోని గోచాబాదికి చెందిన సూర్యకాంత్ బెహెరా తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డారంటూ 22 యేళ్ల యువతి పోలసర పోలీసులకు గతంలో ఫిర్యాదు చేసింది. 
 
దీంతో సూర్యకాంత్‌పై పోలీసులు గత 2024 నవంబరు నెలలో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతడు కొడాలా సబ్ జైలులో విచారణ ఖైదీగా ఉంటున్నాడు. అయితే, ఈ కేసును సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరిగాయి. 
 
ఈ నేపథ్యంలో నిందితుడు, బాధిత యువతి పెళ్లికి అంగీకరించారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆదివారం కొడాలా సబ్ జైలులో వారిద్దరికీ హిందూ సంప్రదాయం ప్రకారం అధికారులు పెళ్లి జరిపించారు. అయితే, తుది తీర్పు వెలువడే వరకు నిందితుడు సూర్యకాంత్ జైలులోనే ఉండనున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

Dhanush: కలాం గా ధనుష్ - కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టైటిల్ ఆవిష్కరణ

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments