Webdunia - Bharat's app for daily news and videos

Install App

లింగ మార్పిడి చేయించుకుంటే పెళ్లి చేసుకుంటా..... ఆపై ముఖం చాటేసిన ప్రియుడు..

ఠాగూర్
శుక్రవారం, 4 జులై 2025 (11:57 IST)
ప్రేమించిన వ్యక్తి కోసం లింగ మార్పిడి చేయించుకుంటే, ప్రియుడు మాత్రం ముఖం చాటేశాడు. అంతేకుకండా, పెళ్లి కాకముందే శారీరకంగా వేధించాడంటూ లింగ మార్పిడి చేయించుకున్న 25 యేళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై అత్యాచారం, వేధింపుల కింద కేసు నమోదు చేశారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రైసెన్ జిల్లా ఒబేదుల్లాగంజ్‌కు చెందిన బాధితురాలు, నర్మదాపురానికి చెందిన నిందింతుడు పదేళ్ల క్రితం కలుసుకున్నారు. ఇద్దరూ స్వలింగ సంపర్కులు కావడంతో వారి పరిచయం ప్రేమగా మారింది. ఆపై చాలాకాలం పాట సహజీవనం చేశారు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు, లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాలని ఒత్తిడి చేసినట్టు బాధితారులు తన ఫిర్యాదులో పేర్కొంది. 
 
పిమ్మట మాట నమ్మి ఇండోర్‌లోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుని యువతిగా మారింది. అయితే, సర్జరీ జరిగిన కొన్ని గంటలకే నిందితుడు ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. వివాహ ప్రస్తావన చేయగా ముఖం చాటేసి చివరకు నిరాకరించాడు. 
 
దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు భోపాల్ పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు క్షుద్రపూజలు కూడా చేస్తాడని, లింగ మార్పిడికి ముందే తనను లైంగికంగా వాడుకున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అలాగే, బాధితురాలికి వైద్య పరీక్షలు చేయగా, లింగ మార్పిడి జరిగినట్టు నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం