Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవసరానికి డబ్బిచ్చిన మేనమామను చంపి ముక్కలు చేసిన కిరాతకుడు..

Webdunia
మంగళవారం, 18 జులై 2023 (09:07 IST)
తనకు అవసరానికి అడిగినపుడల్లా డబ్బు ఇచ్చిన మేనమామను ఓ కిరాతకుడు దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత శరీరాన్ని ముక్కలు చేసి సంచుల్లో పాతిపెట్టాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని గుణ జిల్లాకు చెందిన వివేక్ శర్మ (45) అనే వ్యాపారి తన మేనల్లుడు మోహిత్‌కు రూ.90 వేలు అప్పుగా ఇచ్చాడు. వాటిని తిరిగి ఇవ్వాలని కోరినా మోహిత్ పట్టించుకోలేదు. 
 
ఈ క్రమంలో డబ్బులు వసూలు చేసేందుకు ఈ నెల 12వ తేదీన వివేక్.. మేనల్లుడు మోహిత్ ఇంటికి వెళ్లాడు. డబ్బులు ఇవ్వడం లేదని మోహిత్ తన మేనమామను మట్టుబెట్టాలన్న నిర్ణయానికి వచ్చాడు. దీంతో మామకు మత్తు కలిపిన టీని మోహిత్ ఇచ్చాడు. దీన్ని సేవించగానే అతను అపస్మారకస్థితిలోకి జారుకున్నాడు. ఆ తర్వాత ఆయన్ను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు చేసి శరీర భాగాలను గోనె సంచుల్లో వేసి పాతిపెట్టేశాడు. 
 
అయితే, వివేక్ శర్మ ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసును నమోదు చేసిన పోలీసులు... మోహిత్‌‍ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పాతిపెట్టిన వివేక్ శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments