Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలి జల్సాల కోసం పని చేస్తున్న సంస్థకు కన్నం వేసిన యువకుడు!!

ఠాగూర్
సోమవారం, 19 ఆగస్టు 2024 (09:12 IST)
ప్రియురాలి జల్సాల కోసం ప్రేమికుడు తాను పని చేస్తున్నసంస్థకే కన్నం వేశాడు. ఈ ఆసక్తికర ఘటన హైదరాబాద్ నగరంలోని బషీర్ బాగ్ ఏరియాలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. హైదరాబాద్ బషీర్ బాగ్ చంద్ర నగర్‌కు చెందిన మర్రి సాయిలక్ష్మణ్ గత ఎనిమిదేళ్లుగా బషీర్ బాగ్‌లోని శ్రీసిద్ధి వినాయక జ్యూవెలర్స్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఉండే బంగారు ఆభరణాల షోరూమ్‌లో పని చేస్తున్నాడు. అయితే, గత రెండు నెలల నుంచి చెప్పాపెట్టకుండా పనికి రావడం లేదు. పైగా, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. దీంతో అనుమానించిన యజమాన్యం దుకాణంలో ఆడిట్ నిర్వహించగా, మొత్తం 28 గ్రాముల బంగారం కనిపించకుండా పోయినట్టు గుర్తించారు. దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
కేసు నమోదు చేసిన పోలీసులు.. మొబైల్ సిగ్నెల్స్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో అతడు చెప్పిన విషయాలు విని పోలీసులు విస్తుపోయారు. కనిపించకుండా పోయిన 28 గ్రాముల బంగారంతో పాటు 8 గ్రాముల డైమండ్ నెక్లేస్ కూడా దొంగిలించినట్టు అంగీకరించాడు. వాటిలో కొన్నింటిని మణప్పురం గోల్డ్ లోన్‌లో తాకట్టు పెట్టానని, ఆ ఆ డబ్బును ప్రియురాలి జల్సాల కోసం ఖర్చు చేయడంతో పాటు ఆమెతో కలిసి ఆలయాలకు వెళ్లినట్టు చెప్పాడు. అతని నుంచి 3 గ్రాముల బంగారంతో పాటు తాకట్టుపెట్టిన డైమండ్ నెక్లెస్‌కు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments