Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ వివాహం... పుట్టింటికెళ్లి తిరిగిరాని భార్య, అల్లుడికి మామ బ్లాక్ మెయిల్... ఏమైంది?

Webdunia
సోమవారం, 23 మే 2022 (20:51 IST)
వారం రోజుల క్రితమే ఓ యువకుడు తన ప్రియురాలిని కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. ఐతే తన తల్లిదండ్రులను చూసి వస్తానంటూ నవ వధువు తన పుట్టింటికి వెళ్లింది. ఇక తిరిగి రాలేదు. దీనితో అతడు షాక్ తిన్నాడు. నీ భార్యను వెనక్కి పంపాలంటే తను అడిగినంత డబ్బు ఇచ్చుకోవాలంటూ పిల్లతండ్రి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీనితో అతడు తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

 
మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లయిన కొద్ది రోజులకే తన భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదంటూ ఇండోర్‌లోని ద్వారకాపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు. ఇండోర్‌లోని ఒక గార్మెంట్స్ షాపులో పనిచేసే యువకుడు ద్వారకాపురి రిలాక్స్ గార్డెన్ వెనుక అద్దెకు ఉండేవాడు. ఇండోర్‌లోని గంగా నగర్‌లో నివసిస్తున్న అమ్మాయితో అతనికి పరిచయం ఏర్పడింది.

 
వారి స్నేహం ప్రేమగా మారింది. ఆ యువకుడు అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండా జరిగిన ఈ వివాహాన్ని యువతి తరపు కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనితో పెళ్లయ్యాక యువతి తన పేరెంట్స్ ఇంటికి వెళ్లి వస్తానని చెప్పింది. అతడు సరేనని పంపడంతో అమ్మాయి తండ్రి తన కుమార్తెను వెనక్కి పంపాలంటే తను అడిగినంత డబ్బు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం ప్రారంభించాడు. దీంతో ఆ యువకుడు గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: కుంటుతూ.. గెంతుకుంటూ చావా ట్రైలర్ ఈవెంట్‌కు రష్మిక మందన్న.. అవసరమా? (video)

నాగ్‌పూర్ పోలీసుల కోసం ఫతే ప్రత్యేక స్క్రీనింగ్‌కు హాజరైన సోనూ సూద్

తెలుగులో రాబోతున్న విశాల్ చిత్రం మదగజ రాజా

Monalisa: రామ్ చరణ్ మూవీలో వైరల్ గర్ల్ మోనాలిసా భోంస్లే

చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 తెలుగులో గ్రాండ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

తర్వాతి కథనం
Show comments