Webdunia - Bharat's app for daily news and videos

Install App

నార్సింగిలో దారుణం : మహిళకు మద్యం తాగించి కారులో తిప్పుతూ గ్యాంగ్ రేప్

Webdunia
ఆదివారం, 19 ఫిబ్రవరి 2023 (14:10 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం జరిగింది. మహిళకు మద్యం తాపించిన కొందరు కామాంధులు కారులో తిప్పుతూ సామూహిక అత్యాచారం జరిపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, పీరం చెరువు గ్రామ వద్ద ఓ వివాహిత రాబరి గ్యాంగ్‌ కంటికి కనిపించింది. పైగా ఆ మహిళ ఒక్కటే ఉంది. ఆమె వద్ద బంగారం ఉండటాన్ని గమనించిన ముఠా.. బంగారాన్ని దోపిడీ చేసేందుకు ప్లాన్ చేశారు. 
 
అంతే.. ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని కిస్మత్‌పూర్ వైపు వెళ్లారు. ఆ తర్వాత ఆమెను బెదిరించి, కేకలు వేస్తే చంపేస్తామని బెదిరించారు. ఆ తర్వాత కారును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె వద్ద ఉన్న మొబైల్ ఫోనును స్విచాఫ్ చేశారు. ఆ తర్వాత ఆమెతో బలవంతంగా మద్యం తాగించడంతో ఆమె మత్తులోకి జారుకుంది. దీంతో దోపిడీ ముఠా ఒకరి తర్వాత సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఒకే చోట కారు ఉంటే అనుమానం వస్తుందని భావించిన దుండగులు.. మద్యం మత్తులో ఉన్న మహిళను కారులో తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఆ తర్వాత గండిపేట వద్ద వదిలి అక్కడి నుంచి దండగుల ముఠా పారిపోయింది. కొన్ని గంటల తర్వాత ఆమెకు మత్తు నుంచి కోలుకుని తాను ఉన్న ప్రాంతాన్ని గుర్తించి భర్తకు ఫోన్ చేసి చెప్పింది. అప్పటికే నడవలేని స్థితిలో ఉన్న భార్యను భర్త ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తనకు జరిగిన ఘోరాన్ని భర్తకు వివరించింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు విచారణ చేపట్టి, దుండగుల ఆచూకీ కోసం ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం