Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో దారుణం.. బేకరీలో వ్యక్తిని నరికి చంపిన దుండగులు

ఠాగూర్
సోమవారం, 2 జూన్ 2025 (14:21 IST)
కర్నాటక రాష్ట్రంలోని కొప్పళ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మే 31వ తేదీన బేకరీలో ఓ వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా చంపేశారు. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు.. మృతుడుని చెన్నప్ప నారినాల్‌గా గుర్తించారు. ఏడుగురు వ్యక్తుల బృందం అతడిని వెంబడించింది. దాంతో చెన్నప్ప స్థానికంగా ఉండే ఓ బేకరీలోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, దుండగులు మాత్రం వెంటబడి అతనిపై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. కొందరు కత్తులతో దాడి చేస్తుంటే, మరో వ్యక్తి కర్రతో తలపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చెన్నప్ప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
కాగా, పాత కక్షలు, ఆస్తి వివాదాల కారణంగానే ఈ హత్య జరిగివుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులకు, మృతుడుకి మధ్య గత కొంతకాలంగా ఆస్తికి సంబంధించిన తగాదాలు నడుస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనపై సోషల్  మీడియాలో, స్థానిక ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 
 
పట్టపగలు, అందరూ చూస్తుండానే ఇంతటి దారుణానికి ఒడిగట్టడం, అక్కడున్నవారు ఏమాత్రం స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ హత్యపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

విజయ్ ఆంటోనీ.. భద్రకాళి నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments