చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2023 (11:34 IST)
హైదరాబాద్ నగరంలో మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడ్డాడు. భాగ్యనగరంలోని శివారు ప్రాంతమైన పీర్జాదిగూడలో ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వర్ష అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ బాత్రూమ్‌లో తన చున్నీతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. దీన్ని గమనించిన సహచర విద్యార్థినిలు సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఆగమేఘాలపై వచ్చి ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. వర్షను పరీక్షించిన వైద్యులు అప్పటేకి మృతి చెందినట్టు నిర్ధారించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 
 
వనవర్తికి చెందిన వర్ష... హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తుంది. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకోవడం వర్షకు సుతరామా ఇష్టం లేదు. కానీ, తమ బిడ్డ భవిష్యత్ కోసం ఆ తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చి ప్రైవేట్ కాలేజీలో చేర్పించారు. కానీ, వర్ష బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. అయితే, తమ బిడ్డ ఆత్మహత్యపై తల్లిదండ్రులు అనేక అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఘటన జరిగితే 2 గంటలకు ఫోన్ చేసి చెప్పారని వారు ఆరోపిస్తున్నారు. అందువల్ల తమ కుమార్తె మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని వారు బోరునవిలపిస్తున్నారు. 
 
ప్రేక్షకులు లేని స్టేడియంలో ప్రేమజంట రాసలీలలు - ఇదిగో వీడియో... 
 
ప్రేక్షకులు లేని క్రికెట్ స్టేడియంలో ఓ ప్రేమజంట రాసలీలల్లో మునిగిపోయింది. దీన్ని గమనించిన కెమెరామెన్.. ఆ ప్రేమ జంటపై ఫోకస్ పెట్టి, బిగ్ స్క్రీన్‌పై కనిపించేలా చేశాడు. తమను బిగ్ స్క్రీన్‌పై చూసుకోవడంతో ఆ ప్రేమ జంట ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ప్రియుడు సిగ్గుపడుతూ ముఖాన్ని టవల్‌తో దాచుకోగా, ఆ యువతి మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉండిపోయింది. ఈ ఘటన మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న రెండో క్రికెట్ సందర్భంగా జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. 
 
మెల్‌బోర్న్ స్టేడియంలో పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ చేస్తుంది. ఆ సమయంలో ప్రేక్షకులు పెద్దగా లేరు. ఇదే అదునుగా భావించిన ఓ ప్రేమ జంట రాసలీలల్లో మునిగిపోయింది. ప్రేక్షకులు లేని గ్యాలరీలోకి వెళ్లి కూర్చొన్న ఆ జంటను కెమెరామెన్ ప్రత్యేకంగా ఫోకస్ చేశాడు. ప్రేమావేశంలో ఊసులాడుకుంటున్న ఆ యువతి, యువకుడు, ఒక్కసారిగా టెలివిజన్ స్క్రీన్‌పై తమను తాము చూసుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు. 
 
ఈ ఊహించని పరిణామతో సిగ్గుపడిన ఆ యువకుడు ముఖాన్ని టవల్‌తో దాచుకుని వెళ్లిపోవడం తెరపై కనిపించింది. బిగ్ స్క్రీన్‌పై ఈ సీన్ కనిపించగానే మైదానంలో ఈలలు, కేకలు మిన్నంటాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments