Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహజీవనం చేస్తున్న వ్యక్తితో వచ్చే నెలలో వివాహం.. అంతలోనే యువతి ఆత్మహత్య!

వరుణ్
సోమవారం, 29 జనవరి 2024 (11:32 IST)
హైదరాబాద్ నగరంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తాను సహజీవనం చేస్తున్న వ్యక్తితో వచ్చే నెల 12వ తేదీన వివాహం జరగాల్సివుంది. అంతలోనే ఆ యువతి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ రాష్ట్రానికి చెందిన అదితి భరద్వాజ్ (34) గత కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి స్థిరపడింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసే ఆమె గతంలో ఓ వ్యక్తిని వివాహం చేసుకుని, విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మణికొండలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో తనతో కలిసి పని చేసే చింతల్‌మెట్‌కు చెందిన మహ్మద్ అలీతో సహజీవనం చేస్తుంది. ఈ క్రమంలో అతడు అత్తాపూర్ ఠాణా పరిధిలోని హ్యాపీ హోమ్స్ కాలనీలో ఓ అపార్టు‌మెంట్‌లో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని అందులో అదితిని ఉంచారు. వీరిద్దరూ వచ్చే నెల 12వ తేదీన వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
అయితే, గత రెండు రోజుల క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లిన అదితి గర్భందాల్చినట్టు వైద్యులు వెల్లడించారు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపంతో ఉన్న ఆమె ఆదివారం తెల్లవారుజామున మహ్మద్ అలీకి ఫోన్ చేసి తాను తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు చెప్పారు. దీంతో అతడు హుటాహుటిన ఫ్లాట్‌కు చేరుకునే సమయానికి ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. దీనిపై మహ్మద్ అలీ అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. అదితి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జనసేన పార్టీకి దిల్ రాజు ఇం'ధనం'గా ఉన్నారు : పవన్ కళ్యాణ్

అకీరా నందన్ సినిమా ఎంట్రీపై నిర్ణయం వాడిదే : రేణూ దేశాయ్

విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ పచ్చదనం ముచ్చటేసింది: రేణూ దేశాయ్

'గేమ్ ఛేంజర్‌'కు రూ.600 - 'డాకు మహారాజ్‌'కు రూ.500 బెనిఫిట్ షో టిక్కెట్ ధర ఖరారు!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' చిత్ర ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments