Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడక సుఖం కోసం అతనికి దగ్గరైంది.. చివరకు అతని వేధింపులతో ప్రాణాలు తీసుకుంది...

ఠాగూర్
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (08:15 IST)
ఓ మహిళ పడకసుఖం కోసం కట్టుకున్న భర్తను కాదని మరో వ్యక్తికి దగ్గరైంది. చివరకు అతని వేధింపుల కారణంగానే తన ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
పోలీసుల కథనం మేరకు.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన చందన్ సింగ్ అనే వ్యక్తి భార్య మమత (31). 12 యేళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు. భర్త గ్యాస్ స్టౌవ్‌లు రిపేర్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటారు. భార్య ఇంటిపట్టునే ఉంటూ పిల్లల బాగోగులు చూస్తుంటారు. ఈ క్రమంలో మమతకు అదే ప్రాంతానికి చెందిన రాకేష్ గౌడ్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.
 
కొంతకాలం సాఫీగా సాగినప్పటికీ ఆ తర్వాత మమతను రాకేష్ పలు విధాలుగా వేధింపులకు గురిచేయసాగాడు. వీటిని భరించలేని మమత ప్రాణాలు తీసుకుంది. బుధవారం తమ ఇంట్లోనే ఉరి వేసుకుంది. మృతురాలి శరీరంపై కూడా గాయాలు ఉన్నట్టు స్థానికులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మమత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నిందితుడు రాకేష్ గౌడ్, భర్త చందన్ సింగ్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments