Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్కొండలో దారుణం : నగ్న చిత్రాలు చూపించి బ్లాక్‌మెయిల్ - నెల రోజులుగా...

Webdunia
ఆదివారం, 7 నవంబరు 2021 (17:14 IST)
హైదరాబాద్ నగరంలోని గోల్కొండలో దారుణం జరిగింది. ఒక యువతిపై కొందరు కామాంధులు నెల రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతి నగ్న ఫోటోలు చూపించి ఈ దారుణానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలెనగర్‌ కంచెకు చెందిన ఓ మహిళ (28) తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒక ఇంటిలో అద్దెకు ఉంటోంది. ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఆమెను కొన్ని రోజుల క్రితం స్థానికంగా ఉండే ఎకాత్తాతూ అనే వ్యక్తితో పరిచయమైంది. 
 
అయితే ఏకాత్తతూ తన ఇద్దరు స్నేహితులతో కలిసి అమె ఇంట్లోకి చొరబడి కాళ్లు, చేతులు బందించి గన్‌తో బెదిరించి షాహిన్ నగర్‌కు తీసుకెళ్లి అమెపై అత్యాచారం చేశారని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
అపై తన అశ్లీల వీడియోలు తీసి బెదిరించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడ బంధించి తన ఇద్దరు స్నేహితులతో కలిసి అత్యాచారం చేశారు. ఫొటోలు కూడా తీశాడు. అనంతరం ఆమెను ఇంటి దగ్గర వదిలేశాడు.
 
కాగా, ఈ ఘటనపై గత వారం రోజులుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినా ఫిర్యాదు తీసుకోవడం లేదని బాధితురాలు ఆరోపించింది. ఎవరికైనా విషయం చెబితే ప్రాణాలు తీస్తామని అని బెదిరించడంతో నెల రోజుల నుండి ఎవరికీ చెప్పుకో లేదని తెలిపింది. 
 
బాధితురాలు సంఘటన జరిగిన నాటి నుంచి మనోవేదనకుగురై గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments