Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిదో తరగతి చదివే కుమార్తెపై కన్నతండ్రి అత్యాచారం..

ఠాగూర్
శుక్రవారం, 5 జనవరి 2024 (16:59 IST)
హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి చదవుతున్న కన్నబిడ్డపై కామంతో కళ్లు మూసుకునిపోయిన కన్నతండ్రి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకానికి పాల్పడింది బీహార్ నుంచి నగరానికి పొట్టకూటి కోసం వలస వచ్చిన కసాయి వ్యక్తి కావడం గమనార్హం. 
 
బీహార్ రాష్ట్రానికి చెందిన ఒక ఫ్యామిలీ కుత్బుల్లాపూర్‌కు కొన్నేళ్ళ క్రితం వలస వచ్చింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె తొమ్మిదో తరగతి చదువుతుంది. వయసు 14 యేళ్ళు. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఆ బాలిక పాఠశాలకు వెళ్ళకుండా ఇంటిపట్టునే ఉంటుంది. ఈ క్రమంలో ఇంట్లోనే ఉంటున్న వయసుకొచ్చిన కుమార్తెపై కన్నేసిన కసాయి తండ్రి.. నయానా భయానో లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడసాగాడు. 
 
పైగా, ఈ విషయం తల్లితో సహా ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరించాడు. అయితే రోజు రోజుకూ తండ్రి ఆగడాలు హెచ్చుమీరిపోవడంతో కన్నతల్లి దృష్టికి తీసుకెళ్లింది. అయితే కన్నబిడ్డ మాటలు ఆ తల్లి నమ్మలేదు. పైగా తండ్రిపై లేనిపోనివి చెప్పొద్దంటూ కోపగించుకుంది.  ఆ తర్వాత తన స్నేహితుడి ద్వారా పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments