Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి కోసం తమ్ముడిని చంపేశారు... పేపర్ కట్టర్‌తో గొంతు కోసేశాడు...

murder
Webdunia
ఆదివారం, 7 మే 2023 (11:29 IST)
ఆస్తిని తమ్ముడికి పంచి ఇవ్వాల్సి వస్తుందన్న అక్కసుతో తమ్ముడిని అన్న చంపేశాడు. పేపర్ కట్టర్‌తో గొంతు కోసి ప్రాణాలు తీశాడు. ఈ దారుణం హైదరాబాద్ నగంరోలని చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలక్ పేట మార్కెట్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మలక్ పేట మున్సిపల్ కాలనీకి చెందిన అశోక్ అనే వ్యక్తికి సుమతి, బాలామణి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. సుమతికి కుమారుడు మల్లేశ్ (30)తో సహా ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బాలామణికి నవీన్ (24) అనే కుమారుడు ఉన్నారు. వీరంతా అంబర్‌పేటలోని ప్రేమ నగరులో జీ ప్లస్ వన్ భవంతిలో ఉంటున్నారు. సుమతి, మల్లేశ్ గ్రౌండ్‌ఫ్లోరులో ఉంటుండగా, బాలామణిలు మొదటి అంతస్తులో ఉంటున్నారు. అశోక్ మాత్రం పిండిగర్నీ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. 
 
ఈ క్రమంలో మల్లేశం, నవీన్‌ల మధ్య ఆస్తి గొడవలు తలెత్తాయి. తమ్ముడికి ఆస్తి పంచి ఇవ్వడం ఏమాత్రం ఇష్టం లేని మల్లేశం అతన్ని ఎలాగైనా చంపాలని ప్లాన్ వేశాడు. తన పథకంలో భాగంగా, తండ్రి అశోక్ సమక్షంలోనే పంచాయతీ తేల్సుకుందామని చెప్పిన నవీన్‌ను వెంట బెట్టుకుని బైకు‌పై బయలుదేరాడు. నవీన్ బైకు నడుపుతుండగా, వెనుక మల్లేశం కూర్చొన్నాడు. 
 
మలక్ పేట మార్కెట్‌లో నుంచి వెళ్లేందుకు సుబ్బయ్య హోటల్ పక్క వీధి నుంచి మార్కెట్‌లోకి బైకు వెళ్లింది. అక్కడ కొంత నిర్మానుష్యంగా ఉండటంతో వెనుక కూర్చొన్న మల్లేశ్.. బైకును నడుపుతున్న నీవన్‌ను పేపర్ కట్టర్‌తో గొంతు కోశాడు. ఈ ఘటనతో నవీన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అక్కడ నుంచి పారిపోయేందుకు మల్లేశ్ ప్రయత్నించగా, స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments