హైదరాబాద్ సిటీ నడిబొడ్డున ఉన్న మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి చెరువులోకి దూకాడు. బ్రిడ్జిపై నుంచి వ్యక్తి దూకుతున్న సమయంలో వాహనదారులు కొంత మంది చూసి.. అతన్ని ఆపే ప్రయత్నం చేశారు. అప్పటికే అతను చెరువులోకి దూకేయటంతో.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	దీంతో చెరువులోకి దూకిన వ్యక్తి కోసం ఈతగాళ్లు, బోట్ల సాయంతో వెతుకులాట ప్రారంభించారు. ఆ వ్యక్తి ఆత్మహత్యకు గల కారణాలేంటనే దానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.