Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీటింగుల పేరుతో సీఈవో వక్రబుద్ధి... ఉద్యోగిని ఫిర్యాదు...

ఠాగూర్
ఆదివారం, 4 ఫిబ్రవరి 2024 (09:09 IST)
మీటింగుల పేరుతో ఓ సీఈవో తనలోని వక్రబుద్ధిని ప్రదర్శించాడు. అతని చేష్టలను భరించలేని ఓ ఉద్యోగిని నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. నగరానికి చెందిన ఓ యువతి అమీర్‌పేటలోని ఓ కంపెనీలో హెచ్ఆర్ అండ్ లీగల్ మేనేజరుగా పనిచేస్తుంది. అమెరికాలో అంటున్న ఏద కంపెనీ సీఈవో తొండెపుచంద్రతో జూమ్ మీటింగ్‌లో పాల్గొంటూ వచ్చేది. ఈ సమావేశాల్లోనే ఆయన అసభ్యంగా ప్రవర్తించసాగాడు. 
 
ఈ నేపథ్యంలో గత యేడాది డిసెంబరు నెలలో అమెరికా నుంచి నగరానికి చెందిన చంద్ర.. జనవరి నెల 23వ తేదీన అమీర్‌పేటలోని కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేయగా, ఆ యువతి పాల్గొంది. అపుడు ఆమెను వేధించాడు. జనవరి 2వ తేదీన నెక్లెస్ రోడ్డులోని ఓ రెస్టారెంట్‌కు పిలిపించి తన కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేయగా, అందుకు ఆమె నిరాకరించింది. పైగా, తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది. జీతంతో పాటు ఇతర పత్రాలు ఇవ్వాలని కోరింది. కానీ, ఆమె కోరికను చంద్ర తిరస్కరించి, మళ్లీ వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

నిద్ర లేచాక కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ పాటలు వినేవాడిని : వెంకయ్య నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments