Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య పుట్టింటికి వెళ్ళింది... ఏకాకినయ్యా.. అందుకే చనిపోతున్నా...

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2022 (10:38 IST)
ఓ ఆటో డ్రైవర్ పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బలవన్మరణానికి పాల్పడేముందు ఆయన సెల్ఫీ వీడియో తీశాడు. ఇందులో తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు. కుటుంబ సభ్యులను బాధపెట్టినట్టు బోరున విలపించాడు. తాను తప్పు చేశానని, అందుకే చనిపోతున్నట్టు ఆ వీడియోలో పేర్కొన్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగరం చౌదరి గూడకు చెందిన కె.నరసింహ - లక్ష్మమ్మ దంపతులు దినసరి కూలీలు. వీరి కుమారుడు రవి (35) ఆటోడ్రైవర్‌. పదేళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసకావడంతో మనస్పర్థల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. జీవితంపై విరక్తి చెందిన రవి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడికి ఎనిమిదేళ్లలోపు కుమార్తె, కుమారుడు ఉన్నారు.
 
ఆయన పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముందుగా ఓ సెల్ఫీ వీడియో తీశాడు. అందులో "మద్యానికి బానిసయ్యాను. నా ప్రవర్తనలో మార్పు వస్తుందని నా భార్య పదేళ్లు నాతో కాపురం చేసింది. నాలో మార్పు రాకపోవడంతో.. పుట్టింటికి వెళ్లిపోయింది. ఏకాకినయ్యా. తప్పంతా నాదే. అందుకే చనిపోతున్నా" అంటూ పురుగు మందు తాగాడు. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. శంషాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments